బోయ‌పాటితో సినిమా చేస్తే ఆ కిక్కే వేర‌ప్పా..

రామ్ చరణ్ కు మాట్లాడడం రాదు అంటారు.. కానీ ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఇక మాట్లాడటానికి ఏమీ ఉండదు.. అంతగా మాటలు నేర్చుకున్నాడు మెగా వారసుడు. దీనికి తన సినిమా విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక నిదర్శనంగా చూపించాడు. ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Ramcharan Hilarious Speech at VVR Pre Release Event

ముఖ్యంగా కేటీఆర్ ను ఆయన పొగిడిన తీరు అద్భుతమే. స్పీచ్ మొదట్లోనే కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్. తెలంగాణలో సాధించిన అద్భుత విజయానికి కారణం కేటీఆర్ అంటూ పొగిడేశాడు మెగా వారసుడు. ఆయన త‌న‌కు ఎప్పటికీ అలాగే స్నేహితుడుగా ఉండాలని కోరుకున్నాడు. ఇక ఆ తర్వాత చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ బిగ్ బాస్, బాస్, లీడర్ మీరు ఏదైనా అనండి కాని నాకు మాత్రం ఆయన నాన్న అంటూ చమత్కరించారు చరణ్. సినిమా విషయానికి వస్తే బోయపాటి వర్కింగ్ స్టైల్ గురించి ఇప్పటివరకు చెబితే వినడం తప్ప తనకి కూడా తెలియదు అన్నాడు చరణ్.

కానీ ఇప్పుడు అది తెలిసింది.. అందుకే ఆయనతో ఎన్ని సినిమాలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పాడు మెగా హీరో. జీవితంలో ఒక్కసారి అయినా బోయపాటి దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో కోరుకుంటాడు అని చెప్పాడు చ‌ర‌ణ్. ఆయనను కలిసిన వెంటనే ఏదో తెలియని ఎనర్జీ వస్తుందని.. అలాంటి వ్యక్తి బోయపాటి అంటూ చెప్పాడు మెగా వారసుడు. బోయపాటితో సినిమా చేస్తే ఆ కిక్కే వేర‌ప్పా సినిమా బాబాయ్ సినిమా డైలాగులు తన సినిమా కోసం వాడేసుకున్నాడు చ‌రణ్. ఇక టీ గ్లాస్ గురించి కూడా క‌మెంట్ చేసాడు చ‌ర‌ణ్. ఈ మ‌ధ్య అంతా జ్యూసులు తాగ‌డం మానేసి టీ తాగుతున్నారంట క‌దా.. గ్లాసులు గుర్తు పెట్టుకోండి అంటూ జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేసాడు చ‌ర‌ణ్. మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ వేడుకలో చరణ్ స్పీచ్ బ్లాక్ బస్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here