సంక్రాంతి 2019.. చ‌ర‌ణ్ మిస్స‌య్యేలా ఉన్నాడుగా..

సంక్రాంతి టార్గెట్ ఇది అని చాలా రోజులుగా మ‌న హీరోలు ఖ‌ర్చీఫ్ వేసుకుని కూర్చుంటారు కానీ అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌డానికి అది సినిమా కాదు క‌దా. అందుకే ఇప్పుడు సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు అనుకుంటే రెండు మాత్ర‌మే వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ అనుకున్న టైమ్ కు అనుకున్న విధంగా రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న‌ట్లుగా జ‌రుగుతుంది.

ramcharan

ఎక్క‌డా డిలే కాకుండా అనుకున్న టైమ్ కు షూట్ పూర్తి చేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న తొలిభాగం.. 24న రెండో భాగం విడుద‌ల కానున్నాయి. ఇప్ప‌టికే క్రిష్-బాల‌య్య కాంబినేష‌న్ శాత‌క‌ర్ణిని 2017 సంక్రాంతికి విడుద‌ల చేసి స‌క్సెస్ అందుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేయాల‌ని చూస్తున్నారు. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ వ‌స్తుంటే 11న రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న తీరు చూసిన త‌ర్వాత క‌చ్చితంగా ఇది మార్చ్ కు వెళ్లిపోతుంద‌ని తెలుస్తుంది.

ఎందుకంటే ఇంకా నెల రోజుల షెడ్యూల్ బాకీ ఉండ‌టంతో పాటు కెమెరా మెన్ మార్పుతో లేనిపోని ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని తెలుస్తుంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తో పాటు ప్ర‌శాంత్, స్నేహ న‌టిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్. డిసెంబ‌ర్ నాటికి టాకీ పూర్తి చేసి.. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీ కానున్నారు చిత్ర‌యూనిట్. సంక్రాంతికి సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే నాయ‌క్.. ఎవ‌డు లాంటి విజ‌యాలు సంక్రాంతికి అందుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇక చ‌ర‌ణ్, బాల‌య్య‌తో పాటు వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ఎఫ్ 2 కూడా ఇదే పండ‌క్కి రాబోతుంది. ఈ మేర‌కు దిల్ రాజు అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. జ‌న‌వ‌రి 12న అనిల్ రావిపూడి ఎఫ్ 2 విడుద‌ల కానుంద‌ని చెప్పాడు రాజు. దానికి తోడు దిల్ రాజుకు సంక్రాంతి బాగా క‌లిసొచ్చింది. ఇందులో ఎఫ్ 2.. ఎన్టీఆర్ క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నా చ‌ర‌ణ్ మాత్రం వ‌చ్చే వ‌ర‌కు అనుమాన‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here