ర‌కుల్ నిజంగా శ్రీ‌దేవిగా స‌రిపోయిందా..?

అతిలోక‌సుంద‌రి.. భువ‌నైన మ‌నోహ‌రి.. ఇలా శ్రీ‌దేవికి ఎన్ని బిరుదులు కావాలంటే అన్ని ఇచ్చేయొచ్చు. అంత‌కంటే అందాన్ని మ‌నం చూడటం కూడా క‌ష్ట‌మే. అంత‌టి అంద‌మైన హీరోయిన్ ను రీ ప్లేస్ చేయాలంటే ఎంత క‌ష్టం. ఇప్పుడు క్రిష్ ఈ సాస‌హం చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ర‌కుల్ ను శ్రీ‌దేవి పాత్ర‌లో తీసుకున్నాడు క్రిష్. ముందు నుంచి వినిపిస్తున్న వార్త‌లే అయినా ఎవ‌రూ క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌పోతే లేదేమో అనుకున్నారు కానీ ఉంది.

ఇప్పుడు టెస్ట్ క‌ట్ అయిపోయి.. ఏకంగా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేసారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సంబంధించిన ప్ర‌తీ లుక్ కూడా పిచ్చెక్కించింది. ఎన్టీఆర్ గా బాల‌య్య‌.. ఏఎన్నార్ గా సుమంత్ అదిరిపోయారు. అస‌లు క్రిష్ ఏం చేస్తున్నాడబ్బా అంటూ ఆయ‌న్ని పొగుడుతున్నారు. అయితే ఎందుకో తెలియ‌దు కానీ తొలిసారి క్రిష్ త‌డ‌బ‌డిన‌ట్లుగా అనిపిస్తుంది.

శ్రీ‌దేవిగా ర‌కుల్ లుక్ అంత‌గా స‌రిపోలేద‌నే టాక్ వినిపిస్తుంది. దీనికి నెగిటివ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఎందుకో తెలియ‌దు కానీ శ్రీ‌దేవిలా మాత్రం ర‌కుల్ ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. అయితే ఫోటోలో ఇలా ఉన్నా కూడా రేపు సినిమాలో బాగుంటుందేమో అనే అంచ‌నాలు ఆస‌క్తి కూడా ఉన్నాయి. ఇందులో ఆకుచాటు పిందె త‌డిసే పాట‌తో పాటు మ‌రిన్ని హిట్ సాంగ్స్ కు కూడా బాల‌య్య‌, ర‌కుల్ స్టెప్పులు వేయ‌బోతున్నారు. మ‌రి ర‌కుల్ ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే జ‌న‌వ‌రి 9.. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వ‌చ్చేవ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here