ర‌కుల్ మ‌ళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెట్టిందా..?

ర‌కుల్ ప్రీత్ కు ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీ ప్రీతి పాత్రంగా మారిపోయింది. అంటే ఇష్టంగా అన్న‌మాట‌. ఇప్పుడు అక్క‌డే ఎక్కువ‌గా ఉంటుంది ఈ భామ‌. తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి పూర్తిగా అవ‌కాశాలు దూరం అయ్యేస‌రికి అర‌వంలో పాగా వేయాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డ ఖాకీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వ‌ర‌స‌గా టాప్ హీరోల‌తో సినిమా చేస్తుంది. తాజాగా సూర్య‌తో ఎన్ జి కే.. కార్తితో దేవ్ సినిమాలు చేస్తుంది.

RAKUL PREETH

ఆ మ‌ధ్య శివ కార్తికేయ‌న్ సినిమా అనుకున్నా అది కుద‌ర్లేదు. దానికితోడు విశాల్ కూడా ర‌కుల్ ప్రీత్ పై క‌న్నేసాడు. ఈయన కూడా త‌న సినిమాలో హీరోయిన్ గా ర‌కుల్ ను తీసుకోవాల‌నుకుంటున్నాడు. తెలుగులో ఇప్పుడు ర‌కుల్ కు పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు.

కానీ ఈమె మాత్రం ఇప్ప‌టికీ తెలుగు ఇండ‌స్ట్రీనే కావాలంటుంది. ఇప్పుడు ఇక్క‌డ ఎన్టీఆర్ బ‌యోపిక్ లో శ్రీ‌దేవిగా న‌టిస్తుంది. ఇది హీరోయిన్ రోల్ కాదు.. జ‌స్ట్ కాసేపు ఉండే అతిథి పాత్ర‌. ఇక నాగ‌చైత‌న్య హీరోగా బాబీ తెర‌కెక్కిస్తున్న వెంకీమామాలో న‌టిస్తుంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు మొద‌ల‌వుతుంది తెలియ‌దు. దాంతో ఇప్పుడు ర‌కుల్ తెలుగు దారులు మూసుకుపోయాయి. అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్ వాడుకోవాల‌ని చూస్తుంది. మ‌రోవైపు బాలీవుడ్ లో కూడా ల‌వ్ రంజ‌న్ సినిమాలో అజ‌య్ దేవ్ గ‌న్ తో న‌టిస్తుంది. చేయాల్సిందంతా చేస్తుంది.. మ‌రి ఇలాంటి టైమ్ లో తెలుగులో ర‌కుల్ రీ ఎంట్రీకి స‌రైన ఎంట్రీ ఎప్పుడు దొరుకుతుందో చూడాలిక‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *