మ‌హేశ్ ద‌ర్శ‌కున్ని ప‌ట్టిన ర‌జినీకాంత్..

ర‌జినీకాంత్ ఎప్పుడూ ఎవ‌రికీ అర్థం కాడు. ఈయ‌న్ని అర్థం చేసుకోవాల‌ని ట్రై చేసినా కూడా బుర్ర హీట్ ఎక్క‌డం ఖాయం. లేకపోతే మ‌రేంటి.. ఓ వైపు రాజ‌కీయాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించి ఇక్క‌డ వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు ఈయ‌న‌. ఇప్పుడు మ‌రో సినిమా ఒప్పుకున్నాడు సూప‌ర్ స్టార్. అస‌లు కాలా త‌ర్వాత ఈయ‌న సినిమాలు చేస్తాడా చేయ‌డా అనుకున్నారంతా. 2.0, కాలా త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోతాడ‌ని.. ఇక‌పై సినిమాలు చేయ‌డ‌ని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఆయ‌న ప్లానింగ్ తో అంద‌రికీ పిచ్చెక్కిస్తున్నాడు. కుర్ర ద‌ర్శ‌కులంద‌ర్నీ పోగేసి వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు. మొన్న‌టికి మొన్న రంజిత్ తో కాలా సినిమా పూర్తి చేసిన ర‌జినీ.. ఇప్ప‌టికే శంక‌ర్ తో 2.0 పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు పెట్ట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ యూర‌ప్ లో జ‌రుగుతుంది.

rajinikanth ar murugadoss movie

ఇలాంటి టైమ్ లో మ‌రో సినిమాకు క‌మిట‌య్యాడు ర‌జినీకాంత్. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మురుగ‌దాస్ తో సినిమా ఓకే చేసాడు సూప‌ర్ స్టార్. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో క‌ళానిధి మార‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. చాలా ఏళ్లుగా మురుగ‌దాస్ సినిమా చేయాల‌ని ర‌జినీ అనుకుంటున్నాడు.. మురుగ‌దాస్ కూడా అనుకుంటున్నాడు. కానీ కథ కుదిరినా టైమ్ కుద‌ర్లేదు. ఇప్పుడు ఆ టైమ్ వ‌చ్చింది.

70కి చేరువ‌గా ఉన్న ఈ టైమ్ లో వ‌ర‌స‌గా కుర్రాళ్ల‌తో సినిమాలు చేస్తూ వాళ్ల ఆలోచ‌న‌ల‌ను తీసుకుంటున్నాడు ర‌జినీకాంత్. ఈయ‌న జోరు చూస్తుంటే రాజ‌కీయాల్లో బిజీ అయినా.. సినిమాల విష‌యంలో రాజీ ప‌డేలా క‌నిపించ‌ట్లేదు. చూడాలిక‌.. ఈ సినిమాల దూకుడు ఎప్పుడు త‌గ్గ‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here