మురుగ‌దాస్ తో ర‌జినీ సినిమా.. మ‌రి రాజ‌కీయాలు..?

హాయిగా సినిమాలు చేసుకోక ర‌జినీకాంత్ కు ఎందుకు ఈ రాజ‌కీయాలు..? అయినా సినిమా వాళ్ల‌కు ఏం తెలుసు రాజ‌కీయాలు అంటూ కొన్నాళ్లుగా ర‌జినీపై కొన్ని విమ‌ర్శ‌లు.. దాడులు జరుగుతూనే ఉన్నాయి త‌మిళ‌నాట‌. దీనికి స్వ‌యంగా సూప‌ర్ స్టారే స‌మాధానం ఇచ్చాడు.

RAJINIKANTH

త‌ను ఎందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాను అనే సంగ‌తి పూర్తిగా చెప్పేసాడు ర‌జినీకాంత్. ఆ మ‌ధ్య ఎంజిఆర్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్సిట్యూట్ లో ఎంజిఆర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ర‌జినీ.. త‌ను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేస్తాన‌ని చెప్పాడు. అయితే మాట‌ల్లో చెప్పినంత వేగంగా చేత‌ల్లో మాత్రం చూపించ‌డం లేదు. త‌ను జ‌య‌ల‌లిత‌కు భ‌య‌ప‌డ్డాను అనుకోవ‌డం త‌ప్ప‌ని.. జ‌య నిజ‌మైన నాయ‌కురాలని.. ఆమె ఉన్న‌పుడు త‌న అవ‌స‌రం రాష్ట్రానికి లేద‌నిపించింద‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. అయితే ఇప్పుడు మాత్రం ఆయ‌న సినిమాలే లోకంగా ఉన్నాడు.

అస‌లు మ‌రో 8 నెల‌ల్లో రాజ‌కీయాలు వ‌స్తున్న త‌రుణంలో ఇప్పుడు ఆయ‌న వ‌ర‌స సినిమాలు ఒప్పుకోవ‌డం దేనికి సంకేతం అంటున్నారు అభిమానులు. జ‌య చ‌నిపోయిన త‌ర్వాత త‌మిళ‌నాట రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింద‌ని.. అది పూడ్చ‌డానికే త‌ను వ‌చ్చాన‌ని పెద్ద డైలాగులు చెప్పిన ర‌జినీ.. ఇప్పుడు మాత్రం అన్నీ వదిలేసి సినిమాల‌తో బిజీ అవుతున్నాడు. ఇప్ప‌టికే 2.0 చేసిన ఈ హీరో.. ఇప్పుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ పెట్ట సినిమా కోసం యూర‌ప్ వెళ్లాడు. ఈ సినిమా ఇలా ఉండ‌గానే ఇప్పుడు మురుగ‌దాస్ సినిమా ఒప్పుకున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ లెక్క‌న ఈయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు హ్యాండిచ్చిన‌ట్లే. ఆస‌క్తి లేకుండానే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని అనౌన్స్ చేసాడు సూప‌ర్ స్టార్. దీనివ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం..? ఎవ‌రికి లాభం..? ఈ విష‌యం అర్థం కాక పాపం జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here