2.0 ప్రివ్యూ.. ర‌జినీకాంత్ మేనియా ఉంటుందా..?

ఒక‌ప్పుడు ర‌జినీకాంత్ సినిమా వ‌స్తుందంటే కంపెనీల‌కు కూడా సెల‌వులు ఇచ్చేసేవాళ్లు. క‌బాలికి కూడా ఇది జరిగింది. కానీ కొన్నేళ్లుగా ఈయ‌న సినిమాలు వ‌ర‌స‌గా నిరాశ ప‌రుస్తున్నాయి. దాంతో ఇప్పుడు ర‌జినీ సినిమా అంటే ముందున్నంత ఆస‌క్తి అయితే లేదు. ఇప్పుడు వ‌స్తున్న 2.0 మాత్రం అన్నింటికంటే ప్ర‌త్యేకం.

Rajini 2 point 0 telugu preview

 

ఇండియ‌న్ హైయ్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీ ఇది. ఇప్పుడు ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. పైగా బిజినెస్ కూడా ఈజీగా 400 కోట్లు జ‌రిగింది. దాంతో ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు ఆడియ‌న్స్. ఇదిలా ఉంటే మ‌రికొన్ని గంట‌ల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 10 వేల థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. 2డి కంటే ఎక్కువ‌గా 3డిలోనే సినిమా విడుద‌ల చేస్తున్నారు. ఏ నిర్మాత‌కైనా 540 కోట్ల‌తో సినిమా నిర్మించిన‌పుడు టెన్ష‌న్ ఉంటుంది. కానీ 2.0 విష‌యంలో మాత్రం అదేం లేదు. ఎందుకంటే అక్క‌డున్న‌ది ర‌జినీకాంత్ క‌దా. ఎన్ని కోట్లు పెట్టినా ముందే బిజినెస్ కూడా అయిపోతుంది.

ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ 600 కోట్ల‌కు పైగానే జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. త‌మిళ్ లో ఆకాశాన్ని తాకేస్తున్న రేట్లు.. తెలుగులోనూ అలాగే ఉంది. ఎన్వీఆర్ సినిమాస్ 2.0 హ‌క్కుల్ని భారీ రేట్ కు సొంతం చేసుకున్నారు. అక్క‌డ లైకా ప్రొడ‌క్ష‌న్స్, దిల్ రాజుతో క‌లిపి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ఎన్వీఆర్ సినిమాస్. తెలుగులో కూడా దాదాపు 85 కోట్ల‌కు పైగానే 2.0 బిజినెస్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తుంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 72 కోట్ల‌కు ఈ హ‌క్కుల్ని సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో బాహుబ‌లి 1,2.. ఖైదీ నెం.150.. రంగ‌స్థ‌లం, అర‌వింద స‌మేత‌ కాకుండా మ‌రే చిత్రం 70 కోట్లు వ‌సూలు చేయలేదు. ఇప్పుడు ఓ డ‌బ్బింగ్ సినిమా ఈ ఫీట్ చేయ‌డానికి చూస్తుంది. ప‌దేళ్ల కింద రోబోతో 40 కోట్ల మార్క్ అందుకున్నాడు ర‌జినీకాంత్. మ‌రిప్పుడు ర‌జినీ, శంక‌ర్ ఏం చేస్తారో చూడాలిక‌..! న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. అంతా బాగుంటే ఓకే కానీ ఏదైనా తేడా జిర‌గితే మాత్రం బ‌య్య‌ర్లు భ‌యంక‌రంగా మునిగిపోతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here