బ‌డ్జెట్ కాదు.. స‌బ్జెక్ట్ కావాలంటున్న రాజ‌మౌళి..

అవును నిజ‌మే క‌దా ఇప్పుడు రాజ‌మౌళి చెప్పింది..? బ‌డ్జెట్ పెట్టేవాళ్లు ఉన్నారు క‌దా అని 300.. 400 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఏమ‌వుతుంది..? ఈ మ‌ధ్య కొన్ని సినిమాలు నిరూపించాయి కూడా. ఇప్పుడు రాజ‌మౌళి కూడా దీనిపై సెటైర్ వేసాడు. అయితే కావాల‌ని అన్నాడో లేదంటే అలా వ‌చ్చేసిందో తెలియ‌దు కానీ రాజ‌మౌళి మాట‌లు మాత్రం ఇప్పుడు కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు సూటిగా త‌గిలాయి. ఇండియ‌న్ సినిమాకు కొత్త బాక్సాఫీస్ లెక్క‌లు నేర్పించిన సినిమా బాహుబ‌లి.

Rajamouli Comments on KGF Movie Budget

స‌బ్జెక్ట్ బాగుండి.. స‌రైన రీతిలో తీస్తే ఎంత పెట్టినా కూడా వెన‌క్కి వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం బాహుబ‌లి ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌లిగించింది. ఆ న‌మ్మ‌కంతోనే కొన్ని సినిమాలు వ‌చ్చాయి కూడా. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా బాహుబ‌లి చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేయ‌లేక‌పోయింది. మొహింజ‌దారో.. పులి.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఇలా అన్ని సినిమాలు పోయాయి. ముఖ్యంగా బాహుబ‌లిని టార్గెట్ చేయ‌డం వ‌ల్లే ఇవి పోయాయంటారు విశ్లేష‌కులు.

త‌మ సినిమాల్లో విష‌యం ఉందా లేదా చూసుకోకుండా కేవ‌లం హ‌డావిడి చేయ‌డానికి వ‌స్తే లాభం లేదు. ఇప్పుడు ఇదే విష‌యంపై రాజ‌మౌళి కూడా సెటైర్ వేసాడు. కేవ‌లం భారీ బ‌డ్జెట్ పెడితే ప్యాన్ ఇండియా సినిమాలు కావు.. స‌బ్జెక్ట్ ఉన్న సినిమాలే అవుతాయి అంటూ కేజీయ‌ఫ్ ఆడియో వేడుక‌లో చెప్పాడు. కేజీయ‌ఫ్ సినిమాలో విష‌యం ఉంద‌ని.. బ‌డ్జెట్ కు స‌బ్జెక్ట్ కూడా తోడైతేనే అది అన్ని ఇండ‌స్ట్రీల్లో ఆడుతుంది కానీ కేవ‌లం బ‌డ్జెట్ ఉంటే స‌రిపోద‌ని చెప్పేసాడు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు.

ఈయ‌న మాట‌లు చాలా మందికి నేరుగానే త‌గిలేసి ఉంటాయి. య‌శ్ హీరోగా వ‌స్తున్న కేజియ‌ఫ్ డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, తమిళ్, హిందీల్లో విడుద‌ల కానుంది ఈ చిత్రం. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ చిత్రం కోలార్ గోల్డ్ మైన్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here