రాధికా ఆప్టే మ‌రో సంచ‌ల‌నం.. విక్ర‌మ్ పేరుతో మోసం..

రాధికా ఆప్టే మాట్లాడుతుందంటేనే చాలు ఎవ‌రో ఒక‌రికి మూడింద‌ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఎవ‌ర్ని టార్గెట్ చేస్తుందో ఎప్ప‌టికీ అర్థం కాదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న‌కు లైఫ్ ఇచ్చిన సౌత్ సినిమాలు.. ఇండ‌స్ట్రీ గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేసింది. అక్క‌డి వాళ్ల‌కు మ‌ర్యాద తెలియ‌దు కాబ‌ట్టే అస్స‌లు అటు వైపు కూడా చూడ‌టం లేద‌ని చెప్పింది ఈ భామ‌. అప్ప‌ట్లో బాల‌య్య‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా సెటైర్లు పేల్చిన ఈ భామ‌.. ఇప్పుడు నేరుగా విక్ర‌మ్ పేరు చెప్పి మ‌రీ సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌కు విక్ర‌మ్ సినిమా అని చెప్పి సౌత్ తీసుకొచ్చి ఇక్క‌డ హోట‌ల్లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించింది రాధికా ఆప్టే.

Radhika-apte-sex-allegations-on-south-hero
త‌న‌కు చిన్న చిన్న బ‌ట్ట‌లేయించి ఆడుకున్నార‌ని.. ఫోటోలు తీసి వేధించార‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. తీరా ఆ త‌ర్వాత సినిమా లేదు.. ఫోటోలు కూడా లేవు అని చెప్పింది ఈ భామ‌. ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌న‌కు కేవ‌లం సౌత్ లో మాత్ర‌మే వ‌చ్చాయ‌ని.. అందుకే అక్క‌డ సినిమాలు చేయ‌డం కూడా మానేసాన‌ని చెప్పి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది రాధికా ఆప్టే. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇవి లేవా.. ఇప్పుడు మీటూ అంతా అక్క‌డే క‌దా ఉంది అంటూ రివ‌ర్స్ సెటైర్లు రాధికా ఆప్టేపై ప‌డుతున్నాయి. దీనికి స‌మాధానం చెప్ప‌కుండా కేవ‌లం సౌత్ ఇండ‌స్ట్రీని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. మ‌రి దీనికి రాధికా నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలిక‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *