పూరీ ఆయ‌న‌తోనే ఫిక్సైపోవ‌చ్చా మ‌రి..?

ఇది సినిమా ఇండ‌స్ట్రీ.. ఇక్క‌డ జాలి ద‌యా లాంటివి అస్స‌లు ఉండ‌వు. టెంప‌ర్ సినిమాలో ఎన్టీఆర్ కారెక్ట‌ర్ మాదిరే ఇక్క‌డ అంతా ఉంటారు. ఎవ‌రికి ద‌య అనేది ఉండ‌దు. ఫ్లాప్ వ‌స్తే నిర్ధాక్ష‌ణ్యంగా ప‌క్క‌న‌బెడతారు. ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ ప‌రిస్థితి కూడా అంతే. ఒక‌ప్పుడు ఎలా ఉన్నాడు అనేది కాదు కానీ ఇప్పుడు ఏంటి అనేది కావాలి అంద‌రికీ. ఇండ‌స్ట్రీలో గ‌తం కంటే ప్ర‌స్తుతానికి వ్యాల్యూ ఎక్కువ‌.

ram-and-puri

ప‌ది ఫ్లాపులు ఇచ్చినా ఒక్క హిట్ ఇస్తే నువ్వే కావాలంటారు. అలా కాకుండా ప‌ది హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇచ్చినా కూడా దూరం దూరం అంటారు. ఇప్పుడు పూరీ ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఈయ‌న్ని వ‌ర‌స ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ఏ హీరో కూడా న‌మ్మ‌డం లేదు. ఒక‌ప్పుడు ఈయ‌న క‌థ రాస్తే తిరుగుండేది కాదు.. కానీ ఇప్పుడు ఈయ‌న క‌థంటే భ‌య‌ప‌డుతున్నారు హీరోలు. మొన్న ఆకాశ్ తో చేసిన మెహ‌బూబా కూడా డిజాస్ట‌ర్ అయిపోయింది. అస‌లు ఇప్పుడు ఏం చేస్తే పూరీ ఈ మ‌త్తులోంచి బ‌య‌ట ప‌డ‌తాడో అర్థం కావ‌డం లేదు అభిమానుల‌కు కూడా. అయితే పూరీ ఊహ‌లు మాత్రం మ‌రోలా ఉన్నాయి.

ఈయ‌న ఇప్పుడు సొంత క‌థ‌లు రాయ‌డం మానేసి.. ఇత‌ర రైట‌ర్స్ రాసిన క‌థల వైపు వెళ్తున్నాడు. ఈయ‌న ద‌ర్శ‌కుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాదు.. రైట‌ర్ గా మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. మంచి క‌థ‌లు వ‌స్తే ఇప్ప‌టికీ పూరీలో స‌త్తా త‌గ్గ‌లేదు. టెంప‌ర్ అది నిరూపించింది. ఆ త‌ర్వాత తాను సొంతంగా రాసుకున్న క‌థ‌లే పోయాయి. దాంతో ఇప్పుడు మ‌రో రైట‌ర్ రాసిన క‌థ కోసం చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే రామ్ హీరోగా ఓ సినిమా చేయ‌డానికి ఈయ‌న ముందుకొచ్చాడు. అయితే ఇది పూరీ రాసుకున్న క‌థ‌.. బ‌య‌టి నుంచి అరువు తెచ్చుకున్న క‌థ అనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఈ కాంబినేష‌న్ మాత్రం వ‌ర్క‌వుట్ అయిపోయింది. కాక‌పోతే ఇంకొక్క ఫైన‌ల్ సిట్టింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అది కూడా అయితే ఈ కాంబినేష‌న్ ప‌ట్టాలెక్కిన‌ట్లే. మ‌రి చూడాలిక‌.. పూరీ జ‌గ‌న్నాథ్ ఆ హీరోతోనే ఫిక్సైపోతాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here