దేవుడా.. ప్ర‌భుదేవా మ‌ళ్లీ ఆయ‌న‌తోనే..!

ఈ మ‌ధ్య ద‌ర్శ‌క‌త్వానికి గుడ్ బై చెప్పేసి.. పూర్తిగా న‌ట‌న మీద ఫోక‌స్ చేసాడు ప్ర‌భుదేవా. అందుకే వ‌రస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ఈ వారం ప్ర‌భుదేవా న‌టించిన ల‌క్ష్మీ సినిమా విడుదల కానుంది. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రం డాన్స్ నేప‌థ్యంలో సాగుతుంది.

అస‌లు ఈ సినిమా వ‌స్తున్న‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి చిన్న సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్ర‌భుదేవాను ఆయ‌న అభిమానులు కూడా అడుగుతున్నారు. కానీ ఈయ‌న మాత్రం ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ తో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా చేస్తున్నాడు.

Prabhu Deva To Choreograph For Thugs of Hindostan

ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్ లో అభినేత్రి సినిమా వ‌చ్చింది. అది ఫ్లాప్.. అయినా కూడా ఇప్పుడు ల‌క్ష్మి చేసాడు. ఇది విడుద‌ల కానేలేదు అప్పుడే మ‌రో సినిమా అనౌన్స్ చేసాడు ఈ హీరో. విజ‌య్ తోనే అభినేత్రి సినిమాకు సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు చెప్పాడు ప్ర‌భు.

దాంతో షాక్ అవ్వ‌డం అభిమానుల వంతు అయిపోయింది. అస‌లు ఏం చేస్తున్నాడో.. ఏం మాయ చేస్తున్నాడో తెలియ‌దు కానీ ఇన్ని ప్లాపులు వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉన్నాడు విజ‌య్. ఈయ‌న మంత్రం ఏంటో తెలిస్తే మిగిలిన ద‌ర్శ‌కులు కూడా హాయిగా అదే చేస్తారు క‌దా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here