అత‌న్ని ప్ర‌భాస్ ఇంకా మ‌రిచిపోలేదు..!

ఎవ‌ర్ని మ‌రిచిపోయినా ప‌ర్లేదు కానీ మ‌న‌కు కెరీర్ ఇచ్చిన వాళ్ల‌ను మాత్రం మ‌రిచిపోకూడ‌దు. ఈ విష‌యంలో ప్ర‌భాస్ సూప‌ర్. అత‌డికి కెరీర్ ఎలా వ‌చ్చింది.. ఎవ‌రు ఇచ్చారు అనే విష‌యాల‌పై పూర్తి క్లారిటీ ఉంది. కృష్ణంరాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా కూడా జ‌యంత్ సి ప‌రాన్జీ.. సురేష్ కృష్ణ లాంటి అగ్ర ద‌ర్శ‌కులు ఇవ్వ‌లేని విజయాన్ని వ‌ర్షం సినిమాతో ప్ర‌భాస్ కు ఇచ్చాడు శోభ‌న్.

అప్ప‌టికి ఆయ‌న చేసింది ఒక్క‌టే సినిమా.. బాబీ.. అది కూడా డిజాస్ట‌ర్. కానీ ఆ స‌మ‌యంలో శోభ‌న్ చెప్పిన క‌థ‌ను న‌మ్మి వ‌ర్షం చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు ప్ర‌భాస్. ఇప్పుడు ఆ ద‌ర్శ‌కుడు మ‌న మ‌ధ్య లేడు. కానీ ఆయ‌న త‌న‌యుడు సంతోష్ ఉన్నాడు.

ఈ కుర్రాడు ఇప్పుడు పేప‌ర్ బాయ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఆ రుణం ఇప్పుడు త‌న‌యుడి రూపంలో తీర్చుకుంటున్నాడు ప్ర‌భాస్. పేప‌ర్ బాయ్ సినిమాకు త‌న‌దైన సాయం చేస్తున్నాడు. ట్రైల‌ర్ చూసి సూప‌ర్ అంటూ ప్ర‌మోట్ చేస్తున్నాడు. పైగా గీతాఆర్ట్స్ ఈ చిత్రాన్ని తీసుకోవ‌డం అద్భుతం అంటూ పొగిడేసాడు.

సంప‌త్ నందితో పాటు మిగిలిన యూనిట్ కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. వ‌ర్షం సినిమా త‌న కెరీర్ కు ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో.. సంతోష్ కు కూడా పేప‌ర్ బాయ్ అలాంటి బ్రేక్ ఇస్తుంద‌ని ఆశించాడు ప్ర‌భాస్. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మొత్తానికి ఇంత ఎదిగినా కూడా త‌న కెరీర్ మొద‌టి రోజుల‌ను మాత్రం గుర్తు పెట్టుకున్నాడు ప్ర‌భాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here