పేట్ట టీజ‌ర్.. ర‌జినీకాంత్ ఫ్యాన్స్ కు పండ‌గే..

గులాబి మొక్క‌కు అంటు క‌ట్టిన‌ట్లు.. చాలా ప‌ద్ద‌తిగా పేట్ట సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు కార్తిక్ సుబ్బరాజ్. అక్క‌డ కొత్త‌ద‌నం ఏం లేదు అలాగ‌ని కొత్త‌గా లేద‌ని చెప్ప‌లేం. ఎందుకంటే ర‌జినీకాంత్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాల‌నుకుంటున్నారో అలా చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. క‌థ విష‌యం ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు విడుద‌లైన పేట్ట టీజ‌ర్ ఫ్యాన్స్ కు కిక్ ఎక్కిస్తుంది. ర‌జినీ అలా స్టైల్ గా న‌డుచుకుంటూ వ‌స్తుంటే అరెరే నా సామిరంగా అన్న‌ట్లుంది వ్య‌వ‌హారం.

ముఖ్యంగా ఆయ‌న వాకింగ్ స్టైల్ ను టీజ‌ర్ మొత్తం వాడుకున్నాడు కార్తిక్ సుబ్బ‌రాజ్. ముఖ్యంగా పేట్ట సినిమా ర‌జినీ గ్రేట్ జ‌ర్నీకి ట్రిబ్యూట్ లా ఉంటుంద‌ని చెబుతున్నాడు ఈయ‌న‌. అంటే క‌థ కంటే ముఖ్యంగా ఆయ‌న స్టైల్.. మేన‌రిజ‌మ్స్ ఇవే బాగా హైలైట్ అవుతాయి అన్న‌మాట‌.

గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ ను చూపించిన హ‌రీష్ శంక‌ర్ లా.. బుడ్డాలో అమితాబ్ ను చూపించిన పూరీ జ‌గ‌న్నాథ్ లా.. ఓ అభిమానే ద‌ర్శ‌కుడు అయితే ఎలా హీరోను చూపించొచ్చు అనేది ఇప్పుడు పేట్ట‌లో చూపించ‌బోతున్నాడు కార్తిక్ సుబ్బ‌రాజ్. ముఖ్యంగా పేట్ట‌లో ర‌జినీకాంత్ లుక్ కూడా అదిరిపోయింది. పైగా కార్తిక్ ట్రాక్ రికార్డ్ కూడా అదిరిపోయింది. ఒక్క మెర్క్కూరీ త‌ప్పిస్తే మిగిలిన సినిమాల‌న్నీ హిట్టే.

దాంతో ఇప్పుడు ర‌జినీకాంత్ సినిమా కూడా క‌చ్చితంగా ఆడుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు అభిమానులు. ముఖ్యంగా ఇప్పుడు ర‌జినీకాంత్ కు భారీ హిట్ అవ‌స‌రం. 2.0 కూడా యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోవ‌డంతో ఇప్పుడు ఈయ‌నకు బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌స‌రం. మ‌రి అది సంక్రాంతికి రాబోయే ఈ పేట్ట తీరుస్తుందో లేదో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here