అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం వాషింగ్ట‌న్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్..

ప‌వ‌న క‌ళ్యాణ్ ఏదేదో చేస్తున్నాడు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత మారిపోయాడు. సినిమాల్లో ఉన్న‌పుడు మ‌నం చూసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఇప్పుడు మ‌నం చూస్తున్న ప‌వ‌ర్ స్టార్ కు చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఆయ‌న ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయాల‌ని ఫిక్సైపోయిన త‌ర్వాత ఏం చేస్తున్నాడో తెలియ‌దు కానీ అన్నీ పక‌డ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఈయ‌న వాషింగ్ట‌న్ డిసిలో ఉన్నాడు.

Pawankalyan in washington

అక్క‌డ బెన్ కార్స‌న్ అనే ప‌ర్స‌న్ ను క‌లిసాడు. ఆయ‌న అక్క‌డ హౌజింగ్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ సెక్ర‌టరీ. అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ పై చ‌ర్చ‌లు.. వెన‌క‌బ‌డిన ఏరియాల్లో ఎలా ఇన్వెస్ట్ మెంట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌న‌లు.. సూచ‌న‌లు అక్క‌డ్నుంచి తీసుకుంటున్నాడు ప‌వ‌ర్ స్టార్.

అవి మ‌న ద‌గ్గ‌ర అప్లై చేయాల‌ని చూస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈయ‌న‌తో పాటు నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపిలో క‌చ్చితంగా ఈయ‌న కింగ్ మేక‌ర్ అవుతాడు అన‌డంలో ఆశ్చ‌ర్యమే లేదంటున్నారు విశ్లేష‌కులు. నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కొడ‌తాడేమో అనే అనుమానాలు ఉన్నా కూడా ఇప్పుడు ఆయ‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త.. తెలంగాణ‌లో వ‌చ్చిన ఫ‌లితాలు చూసిన త‌ర్వాత బాబు కంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైనే ఎక్కువ అంచ‌నాలున్నాయి. పైగా జ‌గ‌న్ గెలుస్తాడు.. సిఎం అవుతాడు అనే ఆస‌క్తి కూడా ఇప్పుడు అక్క‌డ పెరిగిపోయింది. మ‌రి ఈ త్రిముఖ పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తార‌నేది చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here