రొటీన్ పందెంకోడితో వ‌స్తున్న విశాల్..

విశాల్ ఈ రోజు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలో స్టార్ గా వెలిగిపోతున్నాడంటే దానికి కార‌ణ‌మైన సినిమా పందెంకోడి. అప్పుడెప్పుడో 14 ఏళ్ల కింద లింగుస్వామి తెర‌కెక్కించిన ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. ఏ ఇమేజ్ లేని విశాల్ ను స్టార్ గా మార్చేసింది. ఈ సినిమాతోనే తెలుగులోనూ జెండా పాతేసాడు ఈ హీరో.

PANDEM KODI TRAILER

పైగా తెలుగ‌బ్బాయి కావ‌డంతో విశాల్ కు ఈ సెంటిమెంట్ కూడా ప‌ని చేసింది. మ‌నోడే అంటే ప్రేక్ష‌కులు ఈ హీరోను బాగానే ఆద‌రించారు. ఇక త‌మిళ్ వ‌ర్ష‌న్ సండేకోజి అయితే మ‌నోడి మార్కెట్ ను రెండింత‌లు చేసింది. పందెంకోడి త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.. ఆ అవ‌స‌రం కూడా రాలేదు ఈ హీరోకు. వ‌ర‌స విజ‌యాల‌తో అటూ ఇటూ స్టార్ అయిపోయాడు.
ఈ మ‌ధ్య సినిమాల‌తో పాటు బ‌య‌ట చేస్తోన్న ప‌నులు కూడా విశాల్ ను రియ‌ల్ హీరోగా మార్చేస్తున్నాయి. క‌ష్టం ఎక్క‌డుంటే అక్క‌డ వాలిపోతున్నాడు విశాల్.

దానికితోడు ఇండ‌స్ట్రీలో విజ‌యాలు కూడా వ‌స్తున్నాయి. అభిమ‌న్యుడుతో అటు ఇటు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు విశాల్. దాంతో అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు పందెంకోడి 2ను తెలుగు,త‌మిళ్ లో ఒకేరోజు విడుద‌ల చేయ‌బోతున్నాడు ఈ హీరో. అక్టోబ‌ర్ 18న సండెకోజి 2 రిలీజ్ కానుంది. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో మ‌రోసారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా న‌టిస్తున్నాడు విశాల్. హీరో తండ్రి పాత్ర‌లో రాజ్ కిర‌ణ్ కంటిన్యూ అవుతున్నాడు. విల‌న్ గా విశాల్ ప్రేయ‌సి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టిస్తుండ‌టం విశేషం. మొత్తానికి రొటీన్ క‌థ‌తోనే పందెంకోడి 2 రాబోతుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో ఎలాంటి మాయ చేస్తాడో..?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here