రివ్యూ: ప‌ందెంకోడి 2

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

పందెంకోడి.. స‌గ‌మే గెలిచింది..
Rating: 2.5/5

www.teluguodu.com

రివ్యూ                     : ప‌ందెంకోడి 2
న‌టీన‌టులు                : విశాల్, కీర్తిసురేష్, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, రాజ్ కిర‌ణ్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు  : ఎన్ లింగుసామి
నిర్మాత‌లు                  : లైకా ప్రొడ‌క్ష‌న్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ

పందెంకోడి అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఉండ‌రేమో..? 13 ఏళ్ల కింద మ‌న ద‌గ్గ‌ర అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ర‌చ్చ చేసిన సినిమా ఇది. ఈ సినిమాతోనే విశాల్ స్టార్ అయ్యాడు. మ‌ళ్లీ ఇన్నేళ్ళ త‌ర్వాత సీక్వెల్ తో వ‌చ్చాడు. మ‌రి ఇదెలా ఉంది..?

క‌థ‌:
ఆరు ఊళ్ల‌కు అనధికార‌క రాజు రాజా రెడ్డి(రాజ్ కిర‌ణ్). ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో అన్ని ఊళ్లు గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటాయి. కానీ ఓ సారి వీర‌భ‌ద్రుడి జాత‌ర్లో జ‌రిగిన గొడ‌వ‌ల్లో ఓ ఊరు వాళ్లు మ‌రో ఊరి వాన్ని న‌రికేస్తారు. దాంతో ఆ త‌ర్వాత భ‌వానీ(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్) భ‌ర్త‌ను ఆ గొడ‌వ‌ల్లో చంపేస్తారు. అప్ప‌ట్నుంచి త‌న భ‌ర్త‌ను చంపిన వాళ్ల వంశంలో ఒక్క‌రు కూడా ఉండ‌కూడ‌ద‌ని పంతం ప‌డుతుంది. ఈ గొడ‌వ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలోనే విదేశాల నుంచి బాలు(విశాల్) వ‌స్తాడు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత గొడ‌వ‌లు మ‌రింత పెరుగుతాయి. అప్ప‌ట్నుంచి ఏం జ‌రిగింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
విశాల్ సినిమా అంటే ఒక‌ప్పుడు మాస్ రొటీన్ అనుకునేవాళ్లు. కొన్నేళ్లుగా ఆ దారి మార్చుకున్నాడు ఈ హీరో.. మాస్ హీరో నుంచి కొత్త క‌థ‌ల వైపు అడుగేసాడు విశాల్. అలా చేసిన ప్ర‌తీసారి దాదాపు విజ‌యం అందుకున్నాడు.. చాలా ఏళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ పందెంకోడి 2తో రొటీన్ రూట్ లోకి వ‌చ్చాడు విశాల్. 13 ఏళ్ల కింద వ‌చ్చిన సినిమాకు సీక్వెల్ కావ‌డంతో అవే అంచ‌నాలు ఉండ‌టం స‌హ‌జం. కానీ అవే దృష్టిలో పెట్టుకుని వెళ్తే మాత్రం క‌చ్చితంగా నిరాశ‌ప‌డ‌తారు.

సీక్వెల్ క‌థ అయినా కూడా పందెంకోడితో పోలిక‌లేం లేవు. కొత్త క‌థ‌నే తీసుకున్నాడు.. కొత్త‌గా మొద‌లుపెట్టాడు.. అయితే మ‌ధ్య‌లో వ‌ద్ద‌నుకున్నా కూడా పందెంకోడి గుర్తుకు వ‌స్తుంది. సీన్స్ అలా డిజైన్ చేసుకున్నాడు లింగుసామి.. అయితే ఆ మాయ మాత్రం క‌నిపించ‌దు. పందెంకోడికి ప్రాణంగా మారిన స్క్రీన్ ప్లే.. సీక్వెల్లో మిస్ అయింది. అక్క‌డ క‌నిపించిన మాయ ఇక్క‌డ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. చిన్న లైన్ తీసుకుని క‌థ‌గా అల్లుకున్నాడు కానీ.. ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయాడేమో అనిపించింది. తొలి 10 నిమిషాల్లోనే క‌థ చెప్పి.. దాని చుట్టూనే తిప్పుకుంటూ వెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు.

ఫ‌స్టాఫ్ ఎంట‌ర్ టైనింగ్ గా అనిపిస్తుంది.. ఇంట‌ర్వెల్ సీక్వెన్స్ బాగుంది. సెకండాఫ్ క‌త్తులు యుద్ధాలు వ‌ద్దంటూ ఎమోష‌న‌ల్ స్క్రీన్ ప్లేతో న‌డిపించాల‌ని చూసాడు లింగుసామి. అయితే క్లైమాక్స్ వ‌ర‌కు అలా లాగ‌డం కాస్త సాగిన‌ట్లే అనిపించింది. ఓవ‌రాల్ గా పందెంకోడి 2.. కొంచెం తీపి.. కొంచెం చేదు.

న‌టీన‌టులు:
విశాల్ మ‌రోసారి యాక్ష‌న్ హీరోగా అల‌రించాడు. అల‌వాటైన పాత్ర‌లో బాగున్నాడు. కీర్తిసురేష్ పాత్ర సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.. అల్ల‌రిపిల్ల‌గా న‌టించ‌డ‌మే కాదు.. రాయ‌ల‌సీమ యాస‌లో డ‌బ్బింగ్ చెప్పుకుంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ బాగా చేసింది.. విల‌నిజం బాగుంది. రాజ్ కిర‌ణ్ మ‌రోసారి ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా అల‌రించాడు. ఆయ‌న న‌ట‌న గురించి కొత్త‌గా ఏం చెప్పాల్సిన ప‌నిలేదు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
యువ‌న్ శంక‌ర్ రాజా పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ఎక్కువ‌గా అర‌వ‌మేళం ఉండ‌టంతో ఇక్క‌డ క‌నెక్ట్ అయ్యేది క‌ష్ట‌మే. ఆర్ఆర్ ప‌ర్లేదు. ఎడిటింగ్ చాలా వీక్ అనిపిస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ అన‌వ‌స‌రంగా వ‌చ్చి క‌థ‌కు అడ్డు ప‌డుతుంటాయి. ముఖ్యంగా ఫ‌స్ట్ పార్ట్ విల‌న్ లాల్ సీన్ అవ‌స‌రం లేదేమో అనిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడు లింగుసామి మ‌రోసారి పాత క‌థ‌తోనే వ‌చ్చాడు. కానీ గ‌త సినిమా సికింద‌ర్ తో పోలిస్తే చాలా బెట‌ర్ ఔట్ పుట్ ఇది. అయితే పందెంకోడి చూసిన వాళ్ల‌కు సీక్వెల్ రుచించ‌దు.

చివ‌ర‌గా:
పందెంకోడి.. స‌గ‌మే గెలిచింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here