ప‌డిప‌డి లేచే మ‌న‌సు టీజ‌ర్ వ‌చ్చేస్తుంది..

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానుంది. అక్టోబ‌ర్ 10న టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి న‌ట‌న ఈ చిత్రానికి హైలైట్ కానుంది. ఫిదా, ఎంసిఏ లాంటి సినిమాల త‌ర్వాత సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. లై ఫ్లాప్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో హ‌ను రాఘ‌వ‌పూడికి కూడా ఈ చిత్రం కీల‌కమే. కోల్ క‌త్తా, నేపాల్ లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు హ‌ను.

Padi Padi Leche Manasu

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తికానుంది. దీనికి బ‌డ్జెట్ కూడా కాస్త భారీగానే పెట్టిస్తున్నాడు ద‌ర్శ‌కుడు హ‌ను. ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ముర‌ళీ శ‌ర్మ‌, వెన్నెల కిషోర్ ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కు సంగీతం అందిస్తున్నారు. జ‌య కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌డిప‌డి లేచే మ‌నసు విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి ఎలాంటి మాయ చేయ‌బోతున్నారో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here