రివ్యూ: ప‌డిప‌డి లేచే మ‌న‌సు

రివ్యూ         : ప‌డిప‌డి లేచే మ‌న‌సు
న‌టీన‌టులు   : శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి,ముర‌ళి శ‌ర్మ‌,ప్రియ‌ద‌ర్శి, సునీల్..
సినిమాటోగ్ర‌ఫీ : జేకే
సంగీతం       : విశాల్ చంద్ర‌శేఖ‌ర్
నిర్మాత‌        : సుధాక‌ర్ చెరుకూరి
ద‌ర్శ‌కుడు     : హ‌ను రాఘ‌వ‌పూడి

ప‌డిప‌డి లేచె మ‌న‌సు.. కొన్ని రోజులుగా రెగ్యుల‌ర్ గా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు ఈ సినిమా విడుద‌లైంది. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి మ్యాజిక్ చేసారా లేదా అనేది చూద్దాం..

క‌థ‌:
సూర్య‌(శ‌ర్వానంద్) ఓ ఫుట్ బాల్ ప్లేయ‌ర్. కోల్ క‌త్తాలో ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు డాక్ట‌ర్ వైశాలి(సాయిప‌ల్ల‌వి)ని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఆ త‌ర్వాత వైశాలి ప్రేమ కోసం వెంట తిరుగుతాడు. చివ‌రికి ఆమె ప్రేమ సాధిస్తాడు. తీరా పెళ్ళి స‌మ‌యం వ‌చ్చేస‌రికి మాట మార్చేస్తాడు సూర్య‌. త‌న‌కు పెళ్ళి అంటే ప‌డ‌ద‌ని చెప్తాడు. సింపుల్ గా క‌లిసుందాం అంటాడు కానీ పెళ్లి మాత్రం వ‌ద్దంటాడు. అలాంటి స‌మ‌యంలో త‌మ ప్రేమ‌ను నిల‌బెట్టుకోడానికి ఓ కండీష‌న్ పెడుతుంది వైశాలి. దానికి సూర్య కూడా ఒప్పుకుంటాడు. కానీ అదే స‌మ‌యంలో భూకంపం వాళ్ల‌ను వేరు చేస్తుంది. అప్పుడు ఏం జ‌రుగుతుంది అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
కొన్ని సినిమాల్లో ఎదో తెలియని మ్యాజిక్ ఉంటుంది.. అవి మనకి ఎన్నిసార్లు చూసినా మనసుకి హత్తుకుపోతుంటాయి.. పడి పడి లేచే మనసు చూసిన తర్వాత నాకు అదే అనిపించింది.. అక్కడ నేను చూస్తున్నది కొత్త కథ కాదు అని నాకు తెలుస్తుంది.. కానీ ఎందుకో తెలియదు చాలా సన్నివేశాలు కొత్తగా అనిపించాయి.. అది దర్శకుడి టేకింగ్ కావచ్చు.. స్క్రీన్ పై శర్వానంద్, సాయి పల్లవి చేసే మాయ కావచ్చు.. కారణం ఏదైనా చాలా కొత్తగా అనిపించింది పడి పడి లేచే మనసు.. ఫస్ట్ హాఫ్ కాస్త సాగినట్లు అనిపించినా కూడా ఫీల్ ఉంది.. శర్వానంద్, సాయి పల్లవి ఉన్న సీన్స్ ఆకట్టుకున్నాయి.. ఇంటర్వెల్ సీన్ కాస్త సిల్లీగా అనిపించినా.. సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. క్లయిమాక్స్ కి వచ్చేవరకు అసలు ట్విస్ట్ దాచేయడం.. చివర్లో రివీల్ చేయడం అన్ని సినిమాల్లో చూసేదే.. ఇందులో కూడా ఆ ట్విస్ట్ ముందు నుంచే ఊహించినా.. ఆ సీన్ లో ఎమోషన్ క్యారీ చేసాడు దర్శకుడు హను. నెమ్మదిగా సాగింది అనే ఒక్క కంప్లైంట్ తప్పితే నిజంగానే పడి పడి లేచింది మనసు.. శర్వానంద్ అద్భుతంగా నటించాడు.. సాయి పల్లవి గురించి ఎం చెప్తాము. స్క్రీన్ పై మాయ చేసింది.. వైశాలిగా ఒదిగిపోయింది.. ఓవరాల్ గా పడి పడి లేచే మనసు.. ఫీల్ గుడ్ సినిమా.

న‌టీన‌టులు:
సూర్య పాత్ర‌లో ప్రాణం పెట్టాడు శ‌ర్వానంద్. ప్ర‌తీ సీన్ చాలా బాగుంది కూడా. సాయిప‌ల్ల‌వితో రొమాన్స్ అదిరింది. ఇక సాయిప‌ల్ల‌వి కూడా శ‌ర్వాతో అదే స్థాయిలో కెమిస్ట్రీ పండించింది. ఆమె పాత్ర కూడా సినిమాకు కీల‌కం. వాళ్లిద్ద‌రి సీన్స్ మ్యాజిక్ అంతే. లీడ్ పెయిర్ త‌ర్వాత అంత‌గా పేలిన పాత్ర మ‌రోటి లేదు. ఉన్నంత‌లో ప్రియ‌ద‌ర్శి ప‌ర్లేదు ఇక సునీల్ కాస్త న‌వ్వించాడు. హీరోయిన్ తండ్రి పాత్ర‌లో ముర‌ళి శ‌ర్మ ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
సినిమాకు ప్రాణం పెట్టాడు సంగీత ద‌ర్శ‌కుడు విశాల్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న‌ సంగీతం మ‌రోస్థాయిలో ఉంది. ప్ర‌తీ పాట తెర‌పై అద్భుతంగా కుదిరింది కూడా. ముఖ్యంగా జేకే సినిమాటోగ్ర‌ఫీ మ్యాజిక్. నేపాల్ తో పాటు కోల్ క‌త్తా అందాలు కూడా సినిమాకు ప్ల‌స్. ఇక ఎడిటింగ్ వీక్ గా ఉంది. ఫ‌స్టాఫ్ లెంతీగా ఉండ‌టం మైన‌స్. ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయిన హ‌ను రాఘ‌వ‌పూడి స్క్రీన్ ప్లే విష‌యంలో మాత్రం ప‌ట్టు వ‌దిలేసాడు. అద్భుత‌మైన ప్రేమ‌క‌థ అవుతుంద‌నుకున్న సినిమా కాస్తా అందుకే ఇంట‌ర్వెల్ త‌ర్వాత గాడి త‌ప్పుతుంది. యావ‌రేజ్ మెలోడ్రామాగా మారిపోయింది.

చివ‌ర‌గా:
ప‌డిప‌డి లేచింది మ‌న‌సు.. టైటిల్ కు త‌గ్గ‌ట్లే అక్క‌డ‌క్క‌డా లేచి ప‌డింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *