క‌లెక్ష‌న్లు కూడా ప‌డిప‌డి లేస్తున్నాయిగా..

ప‌డిప‌డి లేచె మ‌న‌సు.. మొద‌లుపెట్టిన రోజు నుంచి ఏదో తెలియ‌ని ఆస‌క్తి రేకెత్తించిన సినిమా. లై లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడా ఎందుకో తెలియ‌దు కానీ హ‌ను రాఘ‌వ‌పూడిపై మంచి న‌మ్మ‌కం ఉంది ఈ చిత్రంపై. కానీ ఇప్పుడు దాన్ని పోగొట్టుకుంటున్నాడు హ‌ను. ఈ చిత్రం కూడా క‌మ‌ర్షియ‌ల్ గా భారీ ప‌రాజయం వైపు ప‌రుగులు తీస్తుంది.

Padi Padi Leche Manasu First Day Box Office Collections

తొలిరోజు కేవ‌లం రెండున్న‌ర కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది ఈ చిత్రం. దీనికి ముందు వ‌చ్చిన శ‌ర్వా మ‌హాను భావుడు తొలిరోజే 4 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. కానీ ఇప్పుడు ఈ చిత్రం మాత్రం అంత త‌క్కువ తీసుకొచ్చింది. సాయిప‌ల్ల‌వి ఫ్యాక్ట‌ర్ కూడా ప‌ని చేయ‌లేదు.

సినిమా చాలా నెమ్మ‌దిగా ఉంది అనే ఒక్క కార‌ణంతో మంచి క‌థ ఉన్నా కూడా ప్రేక్ష‌కులు లైట్ తీసుకుంటున్నారు. ఇదే సినిమాకు ఇప్పుడు మైన‌స్ గా మారుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ ప‌డిప‌డి లేచె మ‌న‌సుకు డ్రా బ్యాక్ అయిపోతుంది. క‌థ కంటే క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్రేక్ష‌కులు కూడా సినిమాతో డిస్ క‌నెక్ట్ అయిపోయారు. అద్భుత‌మైన ఫ‌స్టాఫ్ ఉన్నా కూడా సెకండాఫ్ మాత్రం ఆ మూడ్ పాడు చేసేలా తీసాడు హ‌ను రాఘ‌వ‌పూడి. దాంతో ఇప్పుడు ఈ చిత్రం కూడా హ‌ను ఆశ‌లు గండి కొట్టేలా క‌నిపిస్తుంది. ఇదే కానీ జ‌రిగితే సాయిప‌ల్ల‌వికి తెలుగులో తొలి షాక్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఈమె న‌టించిన ఫిదా, ఎంసిఏ రెండూ భారీ విజ‌యాలు అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాల‌న్న క‌ల‌కి ప‌డిప‌డి లేచె మ‌న‌సు బ్రేక్ వేసిన‌ట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here