ఎన్టీఆర్.. నెం 1 ఆఫ్ టాలీవుడ్..

అంత ఈజీగా డిసైడ్ చేయ‌డం క‌ష్ట‌మే కానీ ఇప్పుడు ఈయ‌న జోరు చూస్తుంటే మాత్రం లెక్క‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ కంటే తోపు అయితే ఎవ‌రూ క‌ళ్ల ముందు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న దూకుడు కూడా అలాగే ఉంది ఇప్పుడు. వ‌ర‌స‌గా ఒక్కో సినిమాతో త‌న రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు జూనియ‌ర్.

ntr

టెంప‌ర్ నుంచి మొద‌లైన ఎన్టీఆర్ ప్ర‌యాణం ఇప్పుడు అర‌వింద స‌మేత వ‌ర‌కు అరాచ‌కంగా సాగుతుంది. ఒక్కో సినిమాతో ఆయ‌న మారుస్తున్న గేర్లు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేరు. టెంప‌ర్ వ‌ర‌కు ఒక్క 50 కోట్ల సినిమా కూడా ఎన్టీఆర్ కు లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న‌ట్లు స్టార్ హీరోనే కానీ ఒక్క సినిమా కూడా 50 కోట్లు వ‌సూలు చేయ‌లేదు. కానీ నాన్న‌కు ప్రేమ‌తో నుంచి ఎన్టీఆర్ ర‌చ్చ మొద‌లైంది. ఈ సినిమా 54 కోట్లు షేర్ తీసుకొచ్చింది.. ఆ త‌ర్వాత జ‌న‌తా గ్యారేజ్ ఏకంగా 80 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది.

ఇక ఆ త‌ర్వాత వ‌చ్చిన జై ల‌వ‌కుశ కూడా 75 కోట్ల మార్క్ అందుకుంది. ఇకిప్పుడు విడుద‌లైన అర‌వింద స‌మేత అయితే ఏకంగా 100 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసేలా ఉంది. మూడ్రోజుల్లోనే 63 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం. పైగా ఇప్పుడు మ‌రో సినిమా ఏదీ లేక‌పోవ‌డంతో ద‌స‌రా సెల‌వుల్లో వీర‌రాఘ‌వ ర‌చ్చ కొన‌సాగ‌డం ఖాయం. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా వ‌ర‌స‌గా నాలుగోసారి 1.5 మిలియ‌న్ అందుకున్నాడు ఎన్టీఆర్. వ‌ర‌స‌గా మూడు 100 కోట్ల సినిమాలు.. నాలుగు 50 కోట్ల షేర్ సినిమాలు.. నాలుగు సార్లు 1.5 మిలియ‌న్ ఉన్న హీరో టాలీవుడ్ ఎన్టీఆర్ ఒక్క‌డే. ఈ దూకుడు చూసిన త‌ర్వాత ఈయ‌న్ని ఇప్పుడు అన్ అఫీషియ‌ల్ నెంబ‌ర్ వ‌న్ అనొచ్చేమో మ‌రి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *