ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు తొలి సీన్ ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్ బయోపిక్ పై ఇప్పుడు ఎన్ని అంచనాలు నా మాటల్లో చెప్పలేం. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని నందమూరి అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీ కూడా వేచి చూస్తుంది. ఇక సాధారణ సాధారణ ప్రేక్షకులు సైతం ఎన్టీఆర్ బయోపిక్ కోసం వేయి కళ్లతో చూస్తున్నారు. ఇందులో బాలయ్య ఎన్టీఆర్ గా ఎలా నటించి ఉంటాడో.. ఈ చిత్రాన్ని క్రిష్ ఎలా తెరకెక్కించి ఉంటాడో అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుందిప్పుడు. అందుకే జ‌న‌వ‌రి 9 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని చూస్తున్నారు వాళ్లంతా.

NTR Biopic Movie First Scene Sensible

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ సంబంధించి ఆసక్తికరమైన విష‌జ్ఞం ఒక‌టి బయటకు వచ్చింది. కథానాయకుడు సినిమా తొలి సీన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ వినిపిస్తున్న వార్తల ప్రకారం కథానాయకుడు తొలి సీన్ మహానటి తరహాలోనే హాస్పిటల్ లో మొదలవుతుందని తెలుస్తోంది.

అక్కడ బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతుంటే.. బ‌య‌ట‌ ఎన్టీఆర్ ఏడుస్తుండడంతో సినిమా మొదలవుతుందని.. అక్కడి నుంచి కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంద‌ని తెలుస్తోంది. మహానటి కూడా ఇదే పేస్ లో మొదలయ్యింది. అక్కడ కూడా తొలి సీన్ సావిత్రి హాస్పిటల్ సీన్ తోనే మొదలవుతుంది. ఇప్పుడు క‌థానాయ‌కుడు కూడా ఇదే ప్లాన్ చేశాడు ద‌ర్శ‌కుడు క్రిష్. కచ్చితంగా ఈ సినిమా కన్నీళ్లు పెట్టించి థియేటర్ నుంచి ప్రేక్ష‌కుల‌ను బయటకు పంపిస్తుందని అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ జీవితంలో ప్రేక్షకులకు తెలియని చాలా ఉన్నాయని.. కథానాయకుడులో ఆయన వ్యక్తిగత జీవితాన్ని క్రిష్ బాగా హైలెట్ చేయనున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తొలి భాగంలో ఆయన హీరోగా ఎదిగిన కోణాలే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు కూడా క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన పెద్ద కుమారుడు మరణాన్ని సినిమాలో చాలా ఎమోషనల్ గా తీసాడ‌నే ప్రచారం జ‌రుగుతుంది. ఇలాంటి సన్నివేశాలు కథానాయకుడులో చాలానే ఉన్నాయని.. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుందని ధీమాగా చెప్తున్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్. జనవరి 9 కథానాయకుడు.. ఫిబ్రవరి 7న మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here