ఏఎన్నార్ కూడా బ్లాక్ బ‌స్ట‌రే.. క్రిష్ అదుర్స్

ష్ ఏదో మాయ చేస్తున్నాడు.. ఈయ‌న దూకుడు చూస్తుంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల అవుతుంటే అస‌లు అభిమానులు ఆగ‌లేక‌పోతున్నారు. నిజంగానే ప్రాణాలు పోసి అంద‌ర్నీ మ‌ళ్లీ తెర‌పై చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ANR

ఇప్పుడు విడుద‌లైన ఏఎన్నార్ లుక్ కూడా ఇలాగే ఉంది. సుమంత్ అయితే అచ్చంగా తాత‌ను దించేసాడు. ఆయ‌న‌కు పెద్ద‌గా మేకప్ ఖ‌ర్చు కూడా లేన‌ట్లుంది. ఎందుకంటే చూడ్డానికి కూడా అలాగే ఉంటాడు ఈయ‌న‌. కాస్త మారిస్తే తాత‌య్య‌లా మారిపోతాడు సుమంత్. క్రిష్ కూడా ఇప్పుడు ఇదే చేసాడు.

ఈయ‌న్ని తీసుకోవ‌డంతోనే స‌గం విజ‌యం సాధించాడు క్రిష్. ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత విజ‌యం సంపూర్ణం అయింది. ఈయ‌న‌తో పాటు ఈ సినిమాలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి లుక్ కూడా ఇలాగే ఉండ‌బోతుంది. కావాల‌నే లెజెండ‌రీ పాత్ర‌ల‌కు వాళ్ల వార‌సుల‌నే తీసుకుంటున్నాడు క్రిష్. బాల‌య్య‌ను ఎన్టీఆర్ గా.. సుమంత్ ను ఏఎన్నార్ గా చూపిస్తున్న ఈయ‌న‌.. సావిత్రిగా కీర్తిసురేష్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక శ్రీ‌దేవిగా ర‌కుల్ న‌టిస్తుంది. చంద్ర‌బాబునాయుడుగా ఇప్ప‌టికే రానా లుక్ అదిరిపోయింది. మొత్తానికి ఈ లుక్స్ తోనే సినిమా రేంజ్ పెంచేస్తున్నాడు క్రిష్. జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఎన్టీఆర్ బ‌యోపిక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here