ఎన్టీఆర్ షూటింగ్ కు వ‌చ్చాడు.. ఇదిగో సాక్ష్యం..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ మొహానికి రంగేసుకున్నాడు. ఈయ‌న షూటింగ్ కు వ‌చ్చేసాడు. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో అనుకోకుండా అర‌వింద స‌మేత షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. దాంతో నాలుగు రోజులుగా ఈయ‌న ఇంటికే ప‌రిమితం అయ్యాడు. అయితే నాన్న జ‌యంతి సంద‌ర్భంగానే మ‌ళ్లీ సెట్ లో అడుగుపెట్టాడు ఈ హీరో. ఈ విషయం సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ చేసాడు. నీ డెడికేషన్ కు సలాం అన్నా.. మేమంతా నీతోనే ఉన్నాం అంటూ ట్వీట్ చేసాడు.

ntr back to aravinda sametha shooting
ntr back to aravinda sametha shooting

త్రివిక్రమ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. బాధ ఎంతున్నా కూడా దిగ‌మింగుకుని మ‌ళ్లీ సెట్ లోకి అడుగు పెట్టి షూట్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. కానీ జూనియ‌ర్ చేస్తున్నాడు. పైగా ఇప్పుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న సీన్స్ కూడా ఎమోష‌న‌లే కావ‌డం విశేషం.
సెట్ లోకి రాగానే అంతా ఒక్కసారి ఎన్టీఆర్ ను చూసి బాగా ఎమోష‌న‌ల్ అయిపోయారు. జూనియ‌ర్ కూడా ఓ సారి అంద‌ర్నీ ప‌ల‌క‌రించి.. వెంట‌నే ప‌ని మొద‌లుపెట్టాడు.

ఈయ‌న నిబ‌ద్ధ‌త చూసి అక్క‌డున్న వాళ్లే కాదు.. అభిమానులు.. సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఫిదా అయిపోయారు. కొండంత ధైర్యం నేల‌కొరిగినా కూడా గుండె నిబ్బ‌రంతో మ‌ళ్లీ సెట్ లో అడుగుపెట్టి నిర్మాత‌ల కోసం ఆలోచిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్న టైమ్ కు పూర్తి అవుతుందంటున్నాడు మాట‌ల మాంత్రికుడు. ముందు చెప్పిన‌ట్లుగానే సినిమా అక్టోబ‌ర్ 11నే ద‌స‌రా సంద‌ర్భంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here