రివ్యూ: నోటా

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster
Release Date
October 5, 2018

Critic Reviews for The Boxtrolls

NOTA to NOTA
Rating: 2.5/5

www.teluguodu.com

రివ్యూ         : నోటా
న‌టీన‌టులు   : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, యాషికా ఆనంద్, స‌త్యరాజ్, నాజ‌ర్..
సంగీతం       : స‌్యామ్ సిఎస్
సినిమాటోగ్ర‌ఫీ : శాంత‌న కృష్ణ‌ణ్
క‌థ‌            : షాన్ క‌ర‌ప్పుసామి
నిర్మాత‌       : జ‌్ఞాన‌వేల్ రాజా
ద‌ర్శ‌కుడు     : ఆనంద్ శంక‌ర్

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే తెలుగుతో పాటు త‌మిళ‌నాట కూడా అంచ‌నాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏకంగా త‌మిళ్ సినిమాతోనే తెలుగులోకి వ‌చ్చాడు విజ‌య్. ఈయ‌న న‌టించిన నోటా విడుద‌లైంది. మ‌రి ఈ పొలిటిక‌ల్ డ్రామా మ‌న వాళ్ల‌కు ఎంత‌వ‌ర‌కు ఎక్కుతుంది..?

క‌థ‌ :
రాష్ట్ర ముఖ్య‌మంత్రి వాసుదేవ్(నాజ‌ర్) పై ఉన్న‌ట్లుండి అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. శిక్ష కూడా ప‌డే అవ‌కాశం ఉంటుంది. దాంతో వాళ్ల స్వామిజి చెప్పిన‌ట్లుగా త‌న ప‌ద‌విని త‌న కొడుకు వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)కు ఇస్తాడు. అస‌లు రాజ‌కీయం అంటే ఏంటో తెలియ‌ని వ‌రుణ్ పీఠం ఎక్కి హాయిగా వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు. సిఎంగా ఉన్న‌పుడు అత‌డికి అన్ని విధాల సాయ‌ప‌డ‌టానికి మ‌హేంద్ర‌(స‌త్య‌రాజ్) తోడుగా ఉంటాడు. అలాంటి టైమ్ లో వాసుదేవ్ అరెస్ట్ అవుతాడు. సిటీలో అల్ల‌ర్లు చెల‌రేగుతాయి. ఓ పాప చ‌నిపోతుంది. అప్పుడు సిఎం క‌దులుతాడు. నిజంగానే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకుంటాడు. కానీ అదే స‌మ‌యంలో వ‌రుణ్ తండ్రిపై అటాక్ జ‌రుగుతుంది. అప్ప‌ట్నుంచి ఏం జ‌రుగుతుంది.. వ‌రుణ్ పొలిటిక‌ల్ గా ఎలా నెగ్గుకొచ్చాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం :
ప్ర‌తీ శుక్ర‌వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జాత‌కాలు మారిపోతుంటాయి.. కొన్ని వారాల కింద గీత‌గోవిందం చూసిన‌పుడు విజ‌య్ స్టోరీ సెలెక్ష‌న్ లో కింగ్ అనిపించింది. కానీ ఈ శుక్ర‌వారం మాత్రం ఎందుకో కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ తేడాగా క‌నిపిస్తున్నాడు. రొటీన్ క‌థ‌ను కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ చేసే స‌త్తా ఉన్న న‌టుడు విజ‌య్. కానీ నోటాలో మాత్రం ఈయ‌న‌కు స‌రిప‌డినంతా స్ట‌ఫ్ ఇవ్వ‌లేక‌పోయాడేమో అనిపించింది. భ‌ర‌త్ అనే నేను.. లీడ‌ర్ హ్యాంగోవ‌ర్ ఇంకా దిగలేదో ఏమో కానీ.. కాస్త అలాంటి క‌థ‌తోనే నోటా కూడా టేకాఫ్ కావ‌డంతో అంచ‌నాలు పెరిగిపోయాయి. ఫ‌స్టాఫ్ లో కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్. ముఖ్యంగా బ‌స్ సీన్ ఎమోష‌న‌ల్ గా బాగుంది.. ఇంట‌ర్వెల్ ముందు రౌడీ సిఎం డైలాగ్ ఫ్యాన్స్ కు ఎక్కుతుంది. ఇలాంటి ఒక‌ట్రెండు సీన్స్ వ‌ర‌కు ప‌ర్లేదు అనిపించినా.. ఓవ‌రాల్ గా రౌడీ సిఎం అంచ‌నాలు అందుకోలేదు. ఏం తెలియ‌ని వాన్ని తెచ్చి సిఎం కుర్చీలో కూర్చోబెడితే ఏం చేస్తాడో మ‌హేష్ ఒక‌లా చూపించాడు.

ఇక్క‌డ విజ‌య్ త‌న స్టైల్లో చూపించాల‌నుకున్నాడు. కానీ అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేద‌నిపించింది. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ అంతా స్టేజ్ బాగానే సెట్ చేసుకున్నాడు.. సెకండాఫ్ ఆడుకుంటాడేమో అనుకుంటే.. తీరిగ్గా రూమ్ లో వీడియో గేమ్స్ ఆడుకున్నాడు.. స‌త్య‌రాజ్ ల‌వ్ స్టోరీ.. నాజ‌ర్ స్టోరీ క‌థ‌కు అడ్డుప‌డ్డాయి. పాత క‌థ‌కు ప్రాణం పోయాలాని పాపం విజ‌య్ ఎంత ట్రై చేసినా.. పెట్రోల్ లేని బండిలా అక్క‌డే ఆగింది నోటా.. సెకండాఫ్ మ‌రీ ల్యాగ్ కావ‌డం.. తెలిసిన క‌థ కావ‌డం.. త‌మిళ ఫ్లేవ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టం నోటాకు మైన‌స్. ఇన్న మైన‌స్ ల‌లోనూ విజ‌య్ న‌టుడిగా మ‌రోసారి ర‌ప్ఫాడించాడు.. రౌడీ సిఎంగా ఆక‌ట్టుకున్నాడు. ఓవ‌రాల్ గా ఎలా ఉన్నా ప‌ర్లేదు విజ‌య్ కోసం వెళ్తాం అనుకునే వాళ్ళ‌కు నోటా ఛాయిస్.. మిగిలిన వాళ్ల‌క ఆప్ష‌న్ మాత్ర‌మే.. వాళ్లు కూడా నోటా అనుకోవ‌చ్చు.

న‌టీన‌టులు:
రౌడీ సిఎంగా విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ప్పాడించాడు. ఆయ‌న న‌ట‌న గురించి ఏం చెప్పాలి..? అయితే త‌మిళ్ ఫ్లేవ‌ర్ ఉండ‌టంతో విజ‌య్ ఒరిజిన‌ల్ చూడ‌లేక‌పోయాం. పొలిటిక‌ల్ డ్రామా అయినా కూడా ఎందుకో కానీ ఈ క‌థ విజ‌య్ ఇమేజ్ కు అస్స‌లు సూట్ అవ్వ‌లేదు. హీరోయిన్ గా మెహ్రీన్ పేరు ఎందుకు వేసారో వాళ్ల‌కు కూడా తెలియ‌దు. క‌నీసం నాలుగు సీన్లు కూడా లేవు సినిమాలో. అందుకే హీరోయిన్ అన‌డం కంటే గెస్ట్ రోల్ అంటే బాగుంటుందేమో. స‌త్య‌రాజ్ పాత్ర చాలా లెంతీగా ఉంది. త‌మిళ్ వాళ్ల కోస‌మో ఏమో కానీ విజ‌య్ కంటే పెద్ద రోల్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. విజ‌య్ తండ్రిగా నాజ‌ర్ ఓకే. ప్ర‌తిప‌క్ష లీడ‌ర్ గా యాషికా ఆనంద్ బాగా న‌టించింది. మిగిలిన వాళ్ల‌లో అంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.

టెక్నిక‌ల్ టీం:
నోటాకు మంచి సంగీతం ఇచ్చాడు స్యామ్ సిఎస్. ఈయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇదే కొన్ని సీన్స్ కు హైలైట్ గా నిలిచింది.శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క‌వుట్ అయింది. విజువ‌ల్స్ రిచ్ గా అనిపించాయి. ఎడిటింగ్ మాత్రం చాలా వీక్. చాలా సీన్స్ ల్యాగ్ అనిపించాయి. పైగా స‌త్య‌రాజ్ ల‌వ్ స్టోరీ అంత‌సేపు అవ‌స‌రం లేదేమో అనిపిస్తుంది. నిర్మాత‌ జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని చుట్టేసాడు అనిపించింది. ఇక ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ మ‌రోసారి రొటీన్ క‌థ‌తో వ‌చ్చి విజ‌య్ లాంటి న‌టున్ని వేస్ట్ చేసాడేమో అనిపించింది.

చివ‌ర‌గా:
నోటా.. రొటీన్ పొలిటిక‌ల్ డ్రామా.. ఓట్లు రావ‌డం క‌ష్ట‌మే..