నోటా ఫ‌స్ట్ డే కలెక్ష‌న్స్.. గీత‌గోవిందం కంటే త‌క్కువ‌

సినిమా ఎలా ఉన్నా కూడా భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే స్థాయికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఎదిగాడు. టాక్ తో పనిలేకుండా త‌న సినిమాను నిల‌బెట్టే ఇమేజ్ ఇప్పుడు విజ‌య్ సొంతం. నోటా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ చిత్రానికి తొలిరోజు 14 కోట్ల గ్రాస్.. 7.40 కోట్ల షేర్ వ‌చ్చింది. సినిమాను 25 కోట్ల బిజినెస్ చేసారు. మూడు రోజులు ఇలాగే వ‌సూలు చేస్తే సినిమా బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే బ‌య‌ట ప‌డుతుందా అనే అనుమానాలు అయితే వ‌స్తున్నాయి. ఎందుకంటే టాక్ అంత దారుణంగా వ‌చ్చింది మ‌రి. తెలుగులో వ‌ర్క‌వుట్ అవ్వ‌డం క‌ష్టంగానే ఉంది ఈ చిత్రం.

nota-first-day-collections
అయితే తెలుగులోనే ఈ చిత్రం తొలిరోజు 4.55 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక త‌మిళ‌నాట కోటికి పైగానే షేర్ తెచ్చింది. త‌మిళ‌నాట కూడా ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇదే క‌లిసొచ్చింది కూడా. అక్క‌డ కూడా భారీగానే హంగామా చేసారు విజ‌య్ అభిమానులు. ముఖ్యంగా మ‌నోడు కూడా అక్క‌డ థియేట‌ర్స్ కు వెళ్లి అభిమానుల‌తో గ‌డిపాడు. రౌడీ సిఎంను మ‌న కంటే అర‌వంలో బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఆనంద్ శంక‌ర్ రొటీన్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్ర కొంప ముంచేసాడు. ఓవ‌రాల్ గా ఓపెనింగ్ డే వ‌ర‌కు ప‌ర్లేదు.. ఇప్పుడు నిల‌బ‌డాలంటే మాత్రం అద్భుతం చేయాలి. ఈ కుర్ర హీరోకు ఉన్న ఇమేజ్ తో సినిమా ఏదైనా సేఫ్ జోన్ కు వెళ్తుందేమో ఆశ త‌ప్ప ఊహించుకున్న దానికంటే నోటా త‌క్కువ‌గానే వ‌సూలు చేస్తుందిప్పుడు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రగ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here