నెం 1 యారీలో వెంక‌టేష్.. రానాతో ఆడుకున్నాడుగా..

ఎప్ప‌ట్నుంచో ఫ్యాన్స్ వేచి చూసిన మూవెంట్ ఇప్పుడు రానే వ‌చ్చింది. వెంక‌టేష్ వాళ్ల అబ్బాయి రానా చేస్తున్న షోకు వ‌చ్చాడు. గెస్ట్ వ‌చ్చి ర‌చ్చ ర‌చ్చ చేసాడు. వెంక‌టేష్ తో పాటు ఈ షోకు వ‌రుణ్ తేజ్, అనిల్ రావిపూడి కూడా వ‌చ్చారు. ఎఫ్ 2 ప్ర‌మోష‌న్ లో భాగంగా ఈ వేడుక‌కు వ‌చ్చారు ఈ జోడీ.

వ‌చ్చి మామూలు ర‌చ్చ చేయ‌లేదు. వెంక‌టేష్ అయితే చిన్న‌పిల్లాడిలా మారిపోయి రానాతో ఆడుకున్నాడు. రానా కూడా వెంకీ చేసే ప‌నులు చూసి ప‌డిప‌డి న‌వ్వుకున్నాడు. తుల‌సి అంటూ సీరియ‌స్ డైలాగ్ ను కామెడీ చేసాడు వెంక‌టేష్. ఆయ‌న‌తో పాటు వ‌రుణ్ తేజ్, అనిల్ రావిపూడి కూడా ర‌చ్చ చేసారు. వెంక‌టేష్ ఎప్పుడూ రానాను కొడుకులా చూడ‌డు. ఏజ్ గ్యాప్ అంత ఉన్నా కూడా త‌న త‌మ్ముడి మాదిరే చూస్తుంటాడు. ఇప్పుడు ఈ ఇద్ద‌రూ ఒకే షోలో ర‌చ్చ చేస్తున్నారు.

నెంబ‌ర్ వ‌న్ యారీ మొద‌లైన‌ప్ప‌టి నుంచి వెంకీ ఎప్పుడొస్తాడు అని రానాను ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. ఇప్పుడు ప్రోమో కూడా విడుద‌లైంది. ఈ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 23 రోజు ప్ర‌సారం కానుంది. క‌చ్చితంగా ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలుతుంద‌ని రానా కూడా న‌మ్ముతున్నాడు. ఎపిసోడ్ లో మామూలు ర‌చ్చ చేయ‌లేదు వెంక‌టేష్. వ‌రుణ్ తేజ్ తో క‌లిసి వ‌చ్చిన వెంకీ.. ఫుల్లుగా ఆడేసుకున్నాడు. బ‌య‌టికి వ‌చ్చిన‌పుడు వెంకీ చిన్న పిల్లాడిలా మారిపోతాడు అనేది అత‌న్ని చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. పైగా రానా గురించి అన్నీ తెలిసిన‌వాడు అందుకే రానాను ఆడుకోవ‌డంలో ముందే ఉంటాడు వెంకీ. మొత్తానికి ఈ ఫుల్ ఎపిసోడ్ వ‌చ్చిన త‌ర్వాత ద‌గ్గుపాటి ఫ్యాన్స్ కు పండగే పండ‌గ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here