త్వ‌ర‌గా మేల్కో నితిన్.. లేదంటేనా..?

ఇండ‌స్ట్రీలో ఎవ‌రి కెరీర్ కు వాళ్లే బాధ్యులు. మ‌న‌కు ఎలాగూ ఓ సామెత కూడా ఉంది క‌దా తెలుగులో. ఎవ‌రి ఖ‌ర్మ‌కు ఎవ‌రు మాత్రం బాధ్యులు అని.. ఇప్పుడు నితిన్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఒక‌ప్పుడు వ‌ర‌స‌గా 13 ఫ్లాపుల‌తో ఈయ‌న కెరీర్ పూర్తిగా ఎండింగ్ స్టేజ్ కు వ‌చ్చేసింది. అస‌లు నితిన్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యాన్ని కూడా ప్రేక్ష‌కులు మ‌రిచిపోయారు. అలాంటి టైమ్ లో ఇష్క్ తో కెరీర్ మొద‌లుపెట్టాడు నితిన్.

NITHIN VENKY KUDUMULA

ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 26 సినిమాలు చేస్తే.. అందులో 19 ఫ్లాపులు ఉన్నాయి. దాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.. నితిన్ క‌థల ఎంపిక ఎలా ఉంటుందా అని..? జ‌యం.. దిల్.. సై.. ఈ మూడూ కెరీర్ కొత్త‌లో వ‌చ్చిన విజ‌యాలే. ఇష్క్.. గుండె జారి గ‌ల్లంత‌యిందే సెకండ్ ఇన్నింగ్స్ లో వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల‌తో మ‌నోడు మ‌ళ్లీ క్రేజీ హీరో అయ్యాడు. హార్ట్ ఎటాక్ కూడా ప‌ర్లేద‌నిపించింది. మ‌ళ్లీ ఆ త‌ర్వాత ష‌రామామూలే. చిన్నదాన నీ కోసం.. కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ అంటూ ఫ్లాపులు ఇచ్చాడు.

Nithin

త్రివిక్ర‌మ్ వ‌చ్చి అ..ఆ..తో హిట్ ఇచ్చినా వెంట‌నే మ‌ళ్లీ లై ఆ విజ‌యాన్ని అబ‌ద్ధంగా మార్చేసాడు నితిన్. మ‌ధ్య‌లో చ‌ల్ మోహ‌న్ రంగా అంటూ వ‌చ్చినా అది కూడా నిల‌బ‌డ‌లేదు. మొన్న విడుద‌లైన దిల్ రాజు శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా డిజాస్ట‌రే. క‌నీసం దిల్ రాజు కూడా నితిన్ జాత‌కం మార్చ‌లేక‌పోయాడు. ఇప్పుడు వెంకీ కుడుముల‌తో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. భీష్మ పేరుతో వ‌స్తున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది.

ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్. పెళ్లి కాన్సెప్ట్ తోనే ఈ చిత్రం కూడా వ‌స్తుంది. కాక‌పోతే చేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డానికి. మ‌న్మ‌థుడులో నాగార్జున త‌ర‌హా కారెక్ట‌ర్ అన్న‌మాట‌. ఇక ఇదిలా ఉంటే కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య‌ప్ర‌తాప్ తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడు నితిన్. అన్నీకుదిర్తే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కూడా నితిన్ తోనే సినిమా చేయ‌నున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఇన్ని సినిమాలున్నాయి.. వీటిలో ఏది నితిన్ కెరీర్ ను నిల‌బెడుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here