నితిని చేజేతులా చేసుకుంటున్నాడుగా..

ఎవ‌రి ఖ‌ర్మ‌కు ఎవ‌రు మాత్రం బాధ్యులు చెప్పండి. వాళ్లై వాళ్లు చేసుకుంటున్న‌పుడు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ఇప్పుడు నితిన్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఒక‌ప్పుడు వ‌ర‌స‌గా 13 ఫ్లాపుల‌తో ఈయ‌న కెరీర్ పూర్తిగా ఎండింగ్ స్టేజ్ కు వ‌చ్చేసింది. అస‌లు నితిన్ అనే ఓ హీరో ఉన్నాడ‌నే విష‌యాన్ని కూడా ప్రేక్ష‌కులు మ‌రిచిపోయారు.

అలాంటి టైమ్ లో ఇష్క్ తో కెరీర్ మొద‌లుపెట్టాడు నితిన్. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 26 సినిమాలు చేస్తే.. అందులో 19 ఫ్లాపులు ఉన్నాయి. దాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.. నితిన్ క‌థల ఎంపిక ఎలా ఉంటుందా అని..? జ‌యం.. దిల్.. సై.. ఈ మూడూ కెరీర్ కొత్త‌లో వ‌చ్చిన విజ‌యాలే.

Nithin

ఇష్క్.. గుండె జారి గ‌ల్లంత‌యిందే సెకండ్ ఇన్నింగ్స్ లో వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల‌తో మ‌నోడు మ‌ళ్లీ క్రేజీ హీరో అయ్యాడు. హార్ట్ ఎటాక్ కూడా ప‌ర్లేద‌నిపించింది. మ‌ళ్లీ ఆ త‌ర్వాత ష‌రామామూలే. చిన్నదాన నీ కోసం.. కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ అంటూ ఫ్లాపులు ఇచ్చాడు. త్రివిక్ర‌మ్ వ‌చ్చి అ..ఆ..తో హిట్ ఇచ్చినా వెంట‌నే మ‌ళ్లీ లై ఆ విజ‌యాన్ని అబ‌ద్ధంగా మార్చేసాడు నితిన్.

మ‌ధ్య‌లో చ‌ల్ మోహ‌న్ రంగా అంటూ వ‌చ్చినా అది కూడా నిల‌బ‌డ‌లేదు. మొన్న విడుద‌లైన దిల్ రాజు శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా డిజాస్ట‌రే. క‌నీసం దిల్ రాజు కూడా నితిన్ జాత‌కం మార్చ‌లేక‌పోయాడు. ఇప్పుడు వెంకీ కుడుముల‌తో ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాడు నితిన్. అయితే ఇప్పుడు కానీ అది హిట్ కాక‌పోతే మ‌ళ్లీ నితిన్ పూర్తిగా పాత రోజుల్లోకి వెళ్ల‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here