రివ్యూ: నీవెవ‌రో

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

Rating: 3/5

www.teluguodu.com

న‌టీన‌టులు    : ఆది పినిశెట్టి, రితికా సింగ్, తాప్సీ, వెన్నెల కిషోర్, తుల‌సి, స‌త్య‌కృష్ణ‌న్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ  : సాయి శ్రీ‌రామ్
సంగీతం        : అచ్చు అండ్ ప్రాస‌న్
నిర్మాతలు      : ఎంవివి స‌త్య‌నారాయ‌ణ‌, కోన కార్పోరేష‌న్
ద‌ర్శ‌కుడు       : హ‌రినాథ్

తెలుగులో ఇప్ప‌టికే కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కుమ్మేస్తున్న ఆది పినిశెట్టి.. హీరోగా ట్రై చేసాడు. ఈ మ‌ధ్య ఈయ‌న చేసిన కొన్ని సినిమాలు సంచ‌ల‌నం సృష్టించాయి. నిన్నుకోరి.. రంగ‌స్థ‌లం పాత్ర‌లు అయితే ప్రేక్ష‌కుల్లో ముద్ర ప‌డిపోయాయి. దాంతో హీరోగా గుర్తింపు కోసం ఇప్పుడు వేట మొద‌లు పెట్టాడు ఆది. మ‌రి ఈయ‌న పోరాటం ఎంత‌వ‌ర‌కు ఫ‌లించిందో చూద్దాం..

క‌థ‌:
క‌ళ్యాణ్(ఆది పినిశెట్టి) అంధుడు. కానీ త‌న‌కు క‌ళ్లు లేవ‌నే సంగ‌తి కూడా మ‌రిచిపోయి.. హాయిగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. సొంతం ఓ రెస్టారెంట్ పెట్టి స్టార్ చెఫ్ గా ఎదుగుతాడు. క‌ళ్యాణ్ అంటే అను (రితికా సింగ్)కు కూడా చాలా ఇష్టం ఉంటుంది. వీళ్ల పెళ్లికి ఇరు కుటుంబ స‌భ్యులు కూడా ఓకే అంటారు. అలాంటి స‌మ‌యంలో క‌ళ్యాణ్ జీవితంలోకి అనుకోకుండా వెన్నెల‌(తాప్సీ) వ‌స్తుంది. ఉన్న‌ది కొన్ని రోజులే అయినా కూడా క‌ళ్యాణ్ చీక‌టిని తొల‌గించి వెన్నెల నింపుతుంది. కానీ అంత‌లోనే చీక‌టి చేసి త‌ను ఓ క‌ష్టంలో ఇరుక్కుంటుంది. అప్పుడు ఏం జ‌రిగింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
హీరోకు లోపం ఉంటే సినిమాలు ఆడ‌తాయేమో కానీ.. క‌థ‌లోనే లోపం ఉంటే మాత్రం ప్రేక్ష‌కులు అంత ఈజీగా ఒప్పుకోరు. క‌ళ్లు చెవులు లేక‌పోయినా.. రాజా ది గ్రేట్.. రంగ‌స్థ‌లాలు వ‌స్తుంటాయి. కానీ క‌థ లేక‌పోతే మాత్రం ప్రేక్ష‌కుల‌కు ముందు త‌ల‌నొప్పి వ‌స్తుంది. కొన్నిసార్లు టాలెంటెడ్ న‌టులు కూడా ఇలాంటి రొటీన్ క‌థ‌ల‌కు ప‌డిపోతుంటారు. నీవెవ‌రో చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల‌కు అనిపించిన ఫీలింగ్ అయితే ఇదే. ఆది పినిశెట్టి క‌దా.. ఏదో కొత్త‌గా చేసుంటాడు.. పైగా అంధుడి పాత్ర‌.. క‌చ్చితంగా బాగుంటుంద‌నే న‌మ్మ‌కంతోనే వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు.. అస‌లేం న‌చ్చింది ఆదికి ఈ క‌థ‌లో.. అంత‌గా చేయ‌డానికి అనిపిస్తుంది. రంగ‌స్థ‌లం.. స‌రైనోడు.. నిన్నుకోరి లాంటి సినిమాలు చేసిన ఆదిని..

ఇందులో స‌రిగ్గా వాడుకోలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు హ‌రినాథ్. అద్భుత‌మైన న‌టున్ని ఉంచుకుని కూడా ఏం చేయ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు.. క‌థ అంతా ముందే తెలిసిపోతుంటే.. ఇంక స‌స్పెన్స్ ఎక్క‌డుందో మ‌రి వాళ్లకే తెలియాలి. అస‌లే తెలిసిన క‌థ అంటే.. దానికి రొటీన్ స్క్రీన్ ప్లే మ‌రింత నీర‌సం తెప్పించింది. ఎప్పుడు అయిపోతుందా అనిపించే ఫ‌స్టాఫ్.. ఎందుకు మొద‌లైందో తెలియ‌ని సెకండాఫ్.. ఎలాగోలా న‌డిపించాలి కాబ‌ట్టి మ‌ధ్య‌లో వ‌చ్చే వెన్నెల కిషోర్.. స‌ప్త‌గిరి కామెడీ ట్రాక్.. ఇలాంటి స‌స్పెన్స్ డ్రామాలో ఉండాల్సిన టైట్ స్క్రీన్ ప్లే ఇందులో ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు. దాంతో ఆస‌క్తిక‌రంగా మారాల్సిన క‌థ కాస్తా నీర‌సంగా మారిపోయింది. ఆది త‌న‌కు ఉన్నంత‌లో బాగానే చేసాడు.. ఆయ‌న న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు.. తాప్సీ కొత్త‌గా ట్రై చేసింది.. ఆ కొత్త‌గా ఏంటో సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది.. రితికా సింగ్ ప‌ర్లేదు.. సెకండాఫ్ అంతా వెన్నెల కిషోర్ పై న‌డిపించేసాడు ద‌ర్శ‌కుడు హ‌రినాథ్. ఓవ‌రాల్ గా నీవెవ‌రో.. ఆది గోల్ వేసాడు.. కోన వ‌దిలేసాడు..

న‌టీన‌టులు:
ఆది పినిశెట్టి బాగున్నాడు.. బాగా న‌టించాడు కూడా. కానీ ఈయ‌న స్థాయికి త‌గ్గ పాత్ర అయితే కాదు. పైగా గొప్ప క‌థేం కాక‌పోవ‌డంతో న‌టించే వీలు కూడా దొర‌క‌డం లేదు. గురు త‌ర్వాత రితికా చేసిన రెండో సినిమా ఇది. తొలి సినిమాతో పోలిస్తే ఇందులో న‌ట‌న కాస్త త‌గ్గింది. పాత్ర కూడా అలాగే ఉంది. ఇక తాప్సీ మాత్రం తొలిసారి విల‌న్ గా ర‌ప్ఫాడించింది. కోన‌వెంక‌ట్ ఉన్నాడు కాబ‌ట్టి కామెడీ ఉండాల్సిందే. ఆ బాధ్య‌త అంతా వెన్నెల కిషోర్ తీసుకున్నాడు. సెకండాఫ్ అంతా ఈయ‌నే ఉంటాడు.. స‌ప్త‌గిరి అప్పుడ‌ప్పుడూ క‌నిపించాడు.

టెక్నిక‌ల్ టీం:
నీవెవ‌రోకు ప్ర‌ధాన స‌మ‌స్య సంగీతం. సిద్ శ్రీ‌రామ్ పాడిన వెన్నెల పాట మిన‌హాయిస్తే మ‌రేదీ ఆక‌ట్టుకోలేదు. సినిమాటోగ్ర‌ఫీ సాయి శ్రీ‌రామ్ ప‌ర్లేదు అనిపించాడు. ఆదితో పాటు రితికాను కూడా అందంగా చూపించాడు. ఎడిటింగ్ వీక్. సెకండాఫ్ లో సిఐ భార్య‌, వెన్నెల కిషోర్ మ‌ధ్య వ‌చ్చే డ‌బుల్ మీనింగ్ కామెడీతో సినిమాకు అస్స‌లు సంబంధం లేదు.. ఉప‌యోగం అంతకంటే లేదు. ద‌ర్శ‌కుడిగా హ‌రినాథ్ ఆక‌ట్టుకోలేదు. రొటీన్ క‌థే ఉండ‌టంతో ఈ సినిమాకు మైన‌స్ గా మారింది.

చివ‌ర‌గా: నీవెవ‌రో.. ప్రేమ గుడ్డిది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here