కాబోయే వాడితో గోల్డెన్ టెంపుల్లో న‌య‌న‌తార‌..

ఎన్నాళ్లూ ఇంకా ఈ ముసుగులో గుద్దులాట‌.. బ‌య‌టికి ఎప్పుడైనా తెలిసేదే క‌దా..? ఇంకెందుకు దాచుకోవ‌డం.. దాచుకున్నా దాగుతుందా ఏంటి ఇప్పుడు వ్య‌వ‌హారం అన్న‌ట్లుంది న‌య‌న‌తార తీరు చూస్తుంటే. ఈమె ఇప్పుడు ఏమీ దాచుకోవ‌డం లేదు. ముఖ్యంగా ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాల‌న్నీ బ‌య‌టికి చెప్పేస్తుంది న‌య‌న‌తార‌.

విఘ్నేష్ శివ‌న్ గురించి ఎప్పుడు అడిగినా స్నేహితుల‌మే అంటూ త‌ప్పించుకునే న‌య‌న్.. ఇప్పుడు మాత్రం ఓపెన్ గా త‌నే కాబోయే భ‌ర్త అని ఒప్పుకుంది. ఆ మ‌ధ్య ది హిందూ వ‌ర‌ల్డ్ ఆఫ్ ఉమెన్ కార్య‌క్ర‌మంలో అవార్డు తీసుకుంటూ విఘ్నేష్ గురించి ఓపెన్ అయింది న‌య‌న‌తార‌. అవార్డ్ తీసుకున్న సంతోషంలో పేరెంట్స్.. బ్ర‌ద‌ర్ తో పాటు త‌న‌కు కాబోయే భ‌ర్త అంటూ విఘ్నేష్ ను ఉద్దేశించి చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.ఈ స్టేట్ మెంట్ తో తమ బంధాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పింది న‌య‌న‌తార‌.

కొంత‌కాలంగా ప్రియుడితోనే క‌లిసి ఉంది న‌య‌న‌తార‌. ఓ వైపు సినిమాలు చేస్తున్నా కూడా ఎప్ప‌టికప్పుడు స‌మ‌యం దొరికిన ప్ర‌తీసారి విఘ్నేష్ తో క‌లిసి విదేశీ ట్రిప్పులకు వెళ్తూనే ఉంది. ఇక ఇప్పుడు విఘ్నేష్ తో క‌లిపి గోల్డెన్ టెంపుల్ కు కూడా వెళ్లింది. ఇద్ద‌రూ క‌లిసి అక్క‌డికి వెళ్లి దేవున్ని ద‌ర్శించుకున్నారు.

ప్రేమికుల‌కు ఆ గుడి బాగా సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు. ప్ర‌భుదేవా.. శింబుతో ప్రేమ విఫ‌లం అయ్యాక ఇప్పుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉంది. ఈ ద‌ర్శ‌కుడితో మూడేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగింది న‌య‌న‌తార. పెళ్లి అంటే ఎక్క‌డ త‌మ బంధం తెగిపోతుందో అని సింపుల్ గా ప్రేమ‌లోనే ఉన్నారు ఈ జంట‌. తాజాగా విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి ఏడ‌డుగులు న‌డ‌వ‌డానికి ఫిక్స్ అయింది న‌య‌న్. మొత్తానికి చూడాలిక‌.. ఈ జంట ఎప్పుడు ఒక్క‌టవుతారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here