రామ్ చ‌ర‌ణ్ అడ్డాలో ప్ర‌త్య‌క్ష‌మైన న‌య‌న‌తార‌..

అవును.. రామ్ చ‌ర‌ణ్ అడ్డాలో న‌య‌న‌తార ప్ర‌త్య‌క్షం అయింది. అదేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు న‌య‌న‌తార న‌టిస్తున్న సినిమా షూటింగ్ అజార్ బైజాన్ లో జ‌రుగుతుంది. అస‌లు అలాంటి ఓ దేశం ఉంద‌ని మ‌న సినిమా వాళ్ల‌కు చూపించి రామ్ చ‌ర‌ణ్ టీం. విన‌య విధేయ రామ కోసం అక్క‌డికి వెళ్లింది టీం.

Nayanatara in Ram Charan Adada

అక్క‌డే నెల రోజులు షూటింగ్ చేసుకుని వ‌చ్చారు. ఇప్పుడు చ‌ర‌ణ్ త‌ర్వాత న‌య‌న‌తార కూడా అక్క‌డే ఉంది. శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ అజ‌ర్ బైజాన్ లోనే జ‌రుగుతుంది. నెల రోజుల పాటు అక్క‌డే ఈ చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇదివ‌ర‌కే వేలైకార‌న్ లో క‌లిసి న‌టించారు శివ‌కార్తికేయ‌న్, న‌య‌న‌తార‌.

ఇప్పుడు మ‌రోసారి క‌లిసి న‌టిస్తున్నారు. ఇమేజ్ లో త‌న‌కంటే చిన్న‌వాడే అయినా కూడా చిన్న హీరోల‌తో న‌టించ‌డానికి ఎప్పుడూ ముందే ఉంటుంది న‌య‌న‌తార‌. కేవ‌లం త‌న ఇమేజ్ తోనే సినిమాల‌ను న‌డిపించ‌డాన్ని ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. ఇప్ప‌టికే శివ‌కార్తికేయ‌న్ స్టార్.. దానికి తోడు న‌య‌న్ కూడా స్టార్.. ఈ ఇద్ద‌రూ క‌లిస్తే ర‌చ్చ ర‌చ్చే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here