క్వీన్ ఆఫ్ యాక్టింగ్.. న‌య‌నతార బ‌ర్త్ డే స్పెష‌ల్..

13 ఏళ్ల ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది ఓ కేర‌ళ‌కుట్టి. వ‌చ్చిన కొత్త‌లో కేవ‌లం అందాలు త‌ప్ప అభిన‌యం రాద‌నే మాట‌లు కూడా అనిపించుకుంది. గ‌జినీ లాంటి సినిమాల్లో అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌ది దోచేసిన ముద్దుగుమ్మ న‌య‌న‌తార‌. కానీ రాను రాను ఈ భామే న‌ట‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోయింది.

syeraa

అస‌లు ఇప్పుడు ఏదైనా క‌థ చేయాలంటే న‌య‌న్ త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోయింది. ఇప్పుడు ఈమె లేడీ సూప‌ర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా. న‌వంబ‌ర్ 18న న‌య‌న‌తార బ‌ర్త్ డే. ఇండ‌స్ట్రీకి రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తుంటుంది. అందాల‌న్నీ ఆర‌బో స్తుంటారు.. అడిగిన ప్ర‌తీ ప‌నికి సై అంటుంటారు. ఇంత చేసినా కూడా వాళ్ల కెరీర్ ఎన్నాళ్లుంటుందో క్లారిటీ లేదు. కానీ 13 ఏళ్లుగా న‌య‌న‌తార మాత్రం దున్నేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు లేడీ సూప‌ర్ స్టార్ గా మారిపోయి అస‌లు హీరోల‌తో ప‌నిలేకుండా ర‌ప్ఫాడిస్తుంది. న‌య‌న‌తార ఓ క‌థ‌ ఓకే చేసిందంటే నిర్మాత నిశ్చింత‌గా నిద్ర‌పోతాడు.

హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాణం పోస్తుంది న‌య‌న‌తార‌. ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌లే కావ‌డం విశేషం. ద‌ర్శ‌కులు కూడా న‌య‌న‌తార‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త క‌థ‌లు రాస్తున్నారు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు న‌య‌న్ ను మించిన ఆప్ష‌న్ మ‌రోటి క‌నిపించ‌ట్లేదు. గ‌త రెండు మూడేళ్ల‌లో ఆర‌మ్, డోర‌, నానుం రౌడీధానుం లాంటి సినిమాల‌ను కేవ‌లం త‌న ఇమేజ్ తో న‌డిపించింది న‌య‌న‌తార‌.

ఇక ఈ మ‌ధ్యే నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన కోకో.. జ్ఞాన‌ముత్తుతో చేసిన ఇమైక్క నోడిగ‌ల్ సినిమాలు కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది క‌దా.. హీరోల‌ను దూరంగా పెట్టిందేమో అనుకుంటే అది కూడా పొర‌పాటే. ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు సూప‌ర్ స్టార్స్ తోనూ న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో చిరంజీవితో సైరా.. త‌మిళ్ లో అజిత్ విశ్వాసం.. శివ‌కార్తికేయ‌న్ 13వ‌ సినిమాల‌తో బిజీగా ఉంది న‌య‌న్. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ తో పాటు మ‌రోవైపు హీరోల‌తోనూ న‌టిస్తూ బ్యాలెన్స్ చేస్తుంది ఈ భామ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here