కోయిల‌మ్మ 16 కోట్లు నాటౌట్..

కోయిల‌మ్మ ఏంటి.. 16 కోట్లేంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ సినిమాకు న‌య‌న‌తార‌కు సంబంధం ఉంది. ఈమె న‌టించిన తాజా సినిమా పేరు ఇదే. కొన్నేళ్లుగా హీరోల‌తో ప‌ని లేకుండా కేవ‌లం త‌నే అన్ని న‌డిపిస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. గ‌త రెండు మూడేళ్ల‌లో ఆర‌మ్, డోర‌, నానుం రౌడీధానుం లాంటి సినిమాల‌ను కేవ‌లం త‌న ఇమేజ్ తో న‌డిపించింది న‌య‌న‌తార‌.

NAYANATARA

3ఇప్పుడు కూడా కోకో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కొల‌మావు కోకిల ఈ సినిమా పూర్తిపేరు. గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రం చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఇప్ప‌టికే ఐదు రోజుల్లో 16 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం న‌య‌న్ ఇమేజ్ ను మ‌రింత‌గా పెంచేసింది. మ‌రో సినిమా ఏదీ పోటీ లేక‌పోవ‌డం న‌య‌న‌తార సినిమాకు బాగా క‌లిసొచ్చింది.

ఫుల్ ర‌న్ లో ఈజీగా 25 కోట్ల మార్క్ దాటేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది కోకో. స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా.. కామెడీ ప్ర‌ధానంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు నెల్స‌న్. ఈ సినిమాతో పాటు చ‌క్రితోలేటీతో క‌లైయుతుర్ కాలం.. జ్ఞాన‌ముత్తుతో ఇమైక్క నోడిగ‌ల్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. ఒక్క చిరంజీవి సైరా.. అజిత్ విశ్వాసం సినిమాల్లో మాత్ర‌మే ఈమె హీరోల‌తో న‌టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here