న‌య‌న‌తార‌.. నీకో దండం త‌ల్లి..!

ఎందుకు ఇప్పుడు అంత పెద్ద మాట అనేసాం అనుకుంటున్నారా..? ఏం లేదండి.. ఇక్క‌డ రోజుకో కొత్త హీరోయిన్ వ‌స్తుంటుంది. అందాల‌న్నీ ఆర‌బో స్తుంటారు.. అడిగిన ప్ర‌తీ ప‌నికి సై అంటుంటారు. ఇంత చేసినా కూడా వాళ్ల కెరీర్ ఎన్నాళ్లుంటుందో క్లారిటీ లేదు. కానీ 13 ఏళ్లుగా న‌య‌న‌తార మాత్రం దున్నేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు లేడీ సూప‌ర్ స్టార్ గా మారిపోయి అస‌లు హీరోల‌తో ప‌నిలేకుండా ర‌ప్ఫాడిస్తుంది. అవును.. తాజాగా ఈ భామ ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డిపోయింది.

NAYANATARA

న‌య‌న‌తార ఓ క‌థ‌ ఓకే చేసిందంటే నిర్మాత నిశ్చింత‌గా నిద్ర‌పోతాడు. హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాణం పోస్తుంది న‌య‌న‌తార‌. ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ ఫీమేల్ ఓరియెంటెడ్ క‌థ‌లే కావ‌డం విశేషం. తెలుగులో సైరా.. త‌మిళ్ లో విశ్వాసం మిన‌హా అన్నీ అలాంటి సినిమాలే.

ద‌ర్శ‌కులు కూడా న‌య‌న‌తార‌ను దృష్టిలో పెట్టుకునే కొత్త క‌థ‌లు రాస్తున్నారు. ముఖ్యంగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ కు న‌య‌న్ ను మించిన ఆప్ష‌న్ మ‌రోటి క‌నిపించ‌ట్లేదు. గ‌త రెండు మూడేళ్ల‌లో ఆర‌మ్, డోర‌, నానుం రౌడీధానుం లాంటి సినిమాల‌ను కేవ‌లం త‌న ఇమేజ్ తో న‌డిపించింది న‌య‌న‌తార‌.

ఇప్పుడు ఈమె న‌టిస్తున్న సినిమాల‌న్నీ కుర్ర ద‌ర్శ‌కుల‌తోనే. తాజాగా ఈమె న‌టించిన‌ కోకో సినిమా కూడా అంతే. నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం గ‌త వార‌మే విడుద‌లైంది. అనుకున్న‌ట్లుగానే భారీ విజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. ఇప్ప‌టికే చెన్నైలో తొలి మూడు రోజుల్లోనే 12 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది కోకో. ఈ సినిమాతో పాటు చ‌క్రితోలేటీతో క‌లైయుతుర్ కాలం.. జ్ఞాన‌ముత్తుతో ఇమైక్క నోడిగ‌ల్ సినిమాలు చేస్తుంది న‌య‌న‌తార‌. మొత్తానికి ఇప్పుడు న‌య‌న దూకుడు చూస్తుంటే హీరోల‌ను పూర్తిగా దూరం పెట్టేసిన‌ట్లుగా అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here