రివ్యూ: న‌వాబ్

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:5

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (1 votes, average: 2.00 out of 5)
Loading...
movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

Nawab - Godfather comes of age
Rating: 3/5

www.teluguodu.com

Sibling rivalry
Rating: 2.75/5

www.123telugu.com

Nice Saab!
Rating: 3/5

www.gulte.com

Mani Ratnam is Back
Rating: 3/5

www.greatandhra.com

Revisiting Mani Ratnam Mass
Rating: 3/5

www.mirchi9.com

రివ్యూ        : న‌వాబ్
న‌టీన‌టులు  : అర‌వింద్ స్వామి, శింబు, విజ‌య్ సేతుప‌తి, అరుణ్ విజ‌య్, జ్యోతిక‌, ఐశ్వ‌ర్యా రాజేష్, అదితిరావ్ హైద్రీ త‌దిత‌రులు
సంగీతం      : ఏఆర్ రెహ‌మాన్
సినిమాటోగ్ర‌ఫీ: స‌ంతోష్ శివ‌న్
క‌థ‌           : శివ అనంత్, మ‌ణిర‌త్నం
స్క్రీన్ ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు : మ‌ణిర‌త్నం

హిట్ అయినా ఫ్లాప్ అయినా మ‌ణిర‌త్నం సినిమా అంటే ఏదో తెలియ‌ని హంగామా మాత్రం ఉంటుంది. ఇప్పుడు న‌వాబ్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. మ‌రి ఈ చిత్రం మ‌ణి ఆశ‌ల్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టింది..?

క‌థ‌:
సిటీలో పేరు మోసిన గ్యాంగ్ స్ట‌ర్ భూప‌తి రెడ్డి (ప్ర‌కాశ్ రాజ్). ఆయ‌న‌కు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు వ‌ర‌ద‌(అర‌వింద్ స్వామి) తండ్రి ద‌గ్గ‌రే ఉండి అత‌డి వ్యాపారాల‌ను, మాఫియాను చూసుకుంటుంటాడు. ఇక మిగిలిన ఇద్ద‌రు కొడుకుల్లో త్యాగు(అరుణ్ విజ‌య్) దుబాయ్ లో.. రుద్ర(శింబు) సెర్బియాలో ఉంటాడు. అనుకోకుండా ఓ రోజు భూప‌తి రెడ్డిపై అటాక్ జ‌రుగుతుంది. విష‌యం తెలుసుకుని ఇద్ద‌రు కొడుకులు ఇండియాకు వ‌స్తారు. తండ్రిపై అటాక్ చేసింది ఎవ‌రో తెలుసుకోవాలాని ట్రై చేస్తుంటారు. ఇక వాళ్ల‌కు తోడుగా ఇన్స్ పెక్ట‌ర్ ర‌సూల్ (విజ‌య్ సేతుప‌తి). తీరా అది చేసింది త‌మ ముగ్గురు కొడుకుల్లో ఒక‌రు అని తెలుసుకుంటాడు భూప‌తి. అక్క‌డ్నుంచి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
త్నం మెర‌వ‌డం లేదు క‌దా అని త‌క్కువంచ‌నా వేస్తే అది మ‌న తెలివి త‌క్కువే అవుతుంది.. దాని టైమ్ వ‌చ్చిన‌పుడు వ‌చ్చే వెలుగు చూడ‌టం మ‌న వ‌ల్ల కాదు. ప్రేక్ష‌కుల‌ దృష్టిలో మ‌ణిర‌త్నం కూడా అలాంటి ద‌ర్శ‌కుడే.. ఒక‌టి రెండు ఫ్లాపులు వ‌చ్చాయ‌ని ఆయ‌న్ని త‌క్కువంచ‌నా వేయ‌కూడ‌దు. ఆయ‌న క‌థ‌లు న‌చ్చ‌లేదేమో కానీ.. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నెప్పుడూ అగ్ర‌స్థానంలోనే ఉన్నాడు.. ఇప్పుడు న‌వాబ్ సినిమా త‌ర్వాత కూడా ఇదే అనిపించింది ప్రేక్ష‌కుల‌కు కూడా. అక్క‌డ కొత్త క‌థేం లేదు.. అంతా తెలిసిన క‌థే.. ఎన్నో ఏళ్లుగా చూస్తున్న క‌థే.. తండ్రి వార‌స‌త్వం కోసం పోటీ ప‌డే ముగ్గురు కొడుకుల క‌థ‌.. గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా. స‌ర్కార్ పోతే ఆ కుర్చీలోకి ఎవ‌రు రావాల‌ని పోరాడే చిన్న క‌థ‌.. దాన్ని త‌న స్టైల్ లోకి మార్చేసాడు మ‌ణిర‌త్నం.. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసాడు.
వ‌ర‌ద‌.. త్యాగు.. రుద్ర‌.. ర‌సూల్.. భూప‌తి రెడ్డి.. చిన్న‌ప్ప‌.. చిత్ర‌.. ఇలా ఒక్కో పాత్ర‌.. వాటి స్వభావం.. మంచి చెడుల మ‌ధ్య పోరాటం చ‌క్క‌గా చూపించాడు మ‌ణి. తెలియ‌ని స‌న్నివేశాలేం కాక‌పోయినా.. తెరపై తెలియ‌ని మ్యాజిక్ మాత్రం న‌డుస్తుంటుంది. ఫస్టాఫ్ అయితే వింటేజ్ మ‌ణిర‌త్నం క‌నిపించాడు.. సెకండాఫ్ కాస్త గాడి త‌ప్పిన‌ట్లు అనిపించింది. అక్క‌డ‌క్క‌డా కాస్త సాగ‌దీసిన‌ట్లు అనిపించింది.. కానీ క‌థ‌పై ఆస‌క్తి మాత్రం త‌గ్గ‌లేదు. కొన్నిసీన్స్ చూస్తుంటే ఇది త‌ను త‌ప్ప ఇంకెవ‌రూ చేయ‌లేరు అని నిరూపించాడు మ‌ణిర‌త్నం. ఇక ఏఆర్ రెహమాన్ గురించి ఏం చెప్పాలి.. ఆయన బ్యాగ్రైౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం. క్లైమాక్స్ లో కురుక్షేత్రం గుర్తుకు రావ‌డం.. హీరోతో కృష్ణుడి పాత్ర‌ గుర్తుకు తేవ‌డం మ‌ణిర‌త్నం మార్క్ ఛ‌మ‌క్.

న‌టీన‌టులు:
అర‌వింద్ స్వామి మ‌రోసారి త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో మాయ చేసాడు. పోలీస్ ఇన్స్ పెక్ట‌ర్ ర‌సూల్ గా విజ‌య్ సేతుప‌తి ప్రాణం పోసాడు త‌న పాత్ర‌కు. మ‌ణిర‌త్నం త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కం నిల‌బెట్టాడు. ఇక త్యాగుగా అరుణ్ విజ‌య్.. రుద్రగా శింబు ర‌ప్ఫాడించారు. ముఖ్యంగా మూడు పాత్ర‌ల్లో శింబు పాత్ర మ‌రో స్థాయిలో ఉంది. ఈయ‌న ఆటిట్యూడ్ ఆ పాత్ర‌కు బాగా ప్ల‌స్ అయింది. భూప‌తి రెడ్డిగా ప్ర‌కాశ్ రాజ్ బాగున్నాడు. క‌థ‌కు ఆయ‌నే మూలం. జ‌య‌సుధ స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అదితి రావ్ హైద్రీ.. ఐశ్వ‌ర్యా రాజేష్ ఉన్నంతలో ప‌ర్లేదు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ సూప‌ర్బ్. పాట‌లు లేక‌పోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ‌లం. ఎడిటింగ్ లో మ‌ణిర‌త్నం మార్క్ క‌నిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డా కాస్త స్లో అయింది సినిమా. ముఖ్యంగా సెకండాఫ్ లో అనిపిస్తుంది. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ప‌నికి పేరు పెట్టాల్సిన అవ‌స‌రం అంత‌కంటే లేదు. ద‌ర్శ‌కుడిగా మ‌ణిర‌త్నం త‌న స‌త్తా చూపించారు. అయితే క‌థ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే బాగుండేది. తుపాకి ప‌ట్టుకున్నోడు ఆ తూటాకే బ‌లైపోతాడు అని చూపించాడు ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా:
మ‌ణిర‌త్నం బ్యాక్ విత్ ఏ గ్యాంగ్ స్ట‌ర్ బ్యాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here