అర‌వంలోకి నారా వార‌బ్బాయి..

ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో చేసింది చాలు.. ఇక నుంచి త‌మిళ్ లో చేస్తానంటున్నాడు నారా రోహిత్. కొత్త క‌థ‌లు చేయ‌డంలో ఈయ‌న దిట్ట‌. హిట్లు లేవు కానీ ద‌ర్శ‌కుల ఫాలోయింగ్ మాత్రం మ‌నోడికి బాగానే ఉంది. నారా రోహిత్ కోసం కొత్త కొత్త క‌థ‌లు రాసి తీసుకొస్తుంటారు ద‌ర్శ‌కులు.

Nara rohit intrest to act tamil industry

వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు కూడా అలాంటి క‌థే. ఈ సినిమాలో రోహిత్ కారెక్ట‌ర్ కొత్త‌గా ఉండ‌బోతుంది. కొత్త ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన దీన్ని తెర‌కెక్కించాడు. ఇక ఈ సినిమాతో పాటు ఈ వార‌మే ఆటగాళ్లు అంటూ వ‌స్తున్నాడు ఈ కుర్ర హీరో.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న ఆలోచ‌న‌లు మారిపోతున్నాయి. ఇక తెలుగు ఇండ‌స్ట్రీని ఒక్క‌టే ప‌ట్టుకుని కూర్చుంటే ప‌నికాదు అని త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా బాట‌లు వేసుకుంటున్నాడు రోహిత్.

అందుకే ఇక‌పై క‌థ‌ల్లో కూడా యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు. భాషాభేదం లేకుండా అంద‌రికీ న‌చ్చే క‌థ‌లు ఎంచుకుంటాన‌ని చెబుతున్నాడు నారా రోహిత్. ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలు కాకుండా మ‌రో మూడు సినిమాలు ఒప్పుకున్నాడు రోహిత్. కాస్త గ్యాప్ తీసుకుని వ‌చ్చి వీటిని తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కేలా చూసుకుంటానంటున్నాడు రోహిత్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులోనూ రోహిత్ కు స‌రైన గుర్తింపు రాలేదు మ‌రి త‌మిళ‌నాట వెళ్లి ఈ కుర్రాడు ఏం చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here