న‌న్ను దోచుకుందువ‌టే సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster
Release Date
September 21, 2018

Critic Reviews for The Boxtrolls

న‌న్ను దోచుకుందువ‌టే.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా మ‌న‌సు దోచుకుంటుంది..
Rating: 3/5

www.teluguodu.com

స‌మ్మోహ‌నం లాంటి సినిమా త‌ర్వాత సుధీర్ బాబు నుంచి వ‌స్తున్న సినిమా అంటే క‌చ్చితంగా అంచ‌నాలు ఉంటాయి. ఇప్పుడు ఈయ‌న కొత్త ద‌ర్శ‌కుడు ఆర్ఎస్ నాయుడును ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. త‌నే నిర్మాత‌గా మారి చేసిన సినిమా న‌న్ను దోచుకుందువ‌టే. మ‌రి అది నిజంగానే ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుందా లేదా..?

క‌థ‌:
కార్తిక్(సుధీర్ బాబు) సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. త‌న జాబ్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అమెరికా ప్ర‌మోష‌న్ కోసం రోజుకు 18 గంట‌లు ఆఫీస్ లోనే ఉంటాడు. అంత ప‌ని నిబ‌ద్ధ‌త ఉన్న కార్తిక్ ఇంట్లో మ‌ర‌ద‌లితో పెళ్లి త‌ప్పించుకోవాల‌ని మ‌రో అమ్మాయిని ప్రేమించాన‌ని చెప్పి తండ్రి ద‌గ్గ‌ర‌క లాక్ అయిపోతాడు. అప్పుడు షార్ట్ ఫిల్మ్ న‌టి మేఘ‌న అలియాస్ సిరి(న‌భా నటాష్)ను త‌న ప్రేమికురాలిగా తండ్రికి ప‌రిచ‌యం చేస్తాడు కార్తిక్. ఆ త‌ర్వాత ఒక‌దానితో ఒక‌టి ఆ అబ‌ద్ధాన్ని క‌వ‌ర్ చేస్తూ వెళ్తాయి. చివ‌రికి వీటి వ‌ల్ల కార్తిక్ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు ప‌డింది.. అస‌లు మేఘ‌న‌తో కార్తిక్ ల‌వ్ లో ప‌డ్డాడా లేదా అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
నటుడు అన్న తర్వాత నేను అని నిరోపించుకోవాలనే అందరికి ఉంటుంది.. సొంత గుర్తింపు కోసం ఆరాటపడుతుంటాడు.. ఇప్పుడు సుధీర్ బాబులో ఇదే తపన కనిపిస్తుంది. సమ్మోహనంతో మాయ చేసిన ఈ హీరో.. మరోసారి అదే చేసాడు.. నన్ను దోచుకుందువటే.. టైటిల్ లోనే ఆ మత్తు కనిపిస్తుంది కదా. సినిమాలోనూ అది ఉండేలా చూసుకున్నాడు సుధీర్ బాబు.. ఇన్నాళ్లూ ఈయన హీరో మాత్రమే.. కానీ ఇప్పుడు నిర్మాత కూడా. అందుకేనేమో నన్ను దోచుకుందువటే మరింత ప్రత్యేకంగా చూసుకున్నాడు సుధీర్.. ఈ మధ్య ఎక్కువగా సింపుల్ కథలతోనే మాయ చేస్తున్న సుధీర్. నన్ను దోచుకుందువటేలో కూడా ఇది కొనసాగించాడు.. కొత్త కథేం కాదు.. అయినా కొత్త దర్శకున్ని నమ్మాడు సుధీర్..

నిర్మాత నమ్మకాన్ని దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు నిలబెట్టాడు. చిన్న లైన్ తీసుకుని దాన్ని వీలైనంత ఎంటర్టైన్మెంట్ తో కథని నడిపించాడు.. అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినా.. కామెడీతో కవర్ చేసాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్ తో నవ్వులు పూయించారు.

సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ సీన్స్ తో స్లో అయింది. సుధీర్ బాబు చాలా బాగా చేసాడు.. కొత్తమ్మాయి నభ నటాష్ తన నటనతో మాటాష్ చేసింది. చాలా బాగా నటించింది.. కళ్ళతోనే మాయ చేసింది.. కాకపోతే తెలిసిన కథ కావడం.. రొటీన్ స్క్రీన్ ప్లే కాస్త మైనస్. ఈ కంప్లైంట్స్ లేకపోతే.. నన్ను దోచుకుందువటే నిజంగానే మనసు దోచుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చాలా బాగా హ్యాండిల్ చేసాడు ద‌ర్శ‌కుడు. కొత్త ద‌ర్శ‌కుడే అయినా కూడా చాలా సీన్స్ మంచి ఈజ్ తో తెర‌కెక్కించాడు. ముఖ్యంగా హీరో కారెక్ట‌రైజేష‌న్ తోనే కామెడీ పుట్టించడం హైలైట్. ఓవ‌రాల్ గా న‌న్ను దోచుకుందువంటే సింపుల్ అండ్ బ్యూటీఫుల్ గా చేసాడు ద‌ర్శ‌కుడు.

నటీన‌టులు:
స‌మ్మోహ‌నంలోనే మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు ఇప్పుడు మ‌రోసారి బాగా న‌టించాడు. సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్ తో మార్కులు అందుకున్నాడు. ఇక హీరోయిన్ అయితే హీరోను కూడా డామినేట్ చేసింది. న‌భా న‌టాషా తెలుగ‌మ్మాయి కాక‌పోయినా ఎక్స్ ప్రెష‌న్స్ తో ప్రాణం తీసింది. న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. హీరో తండ్రిగా నాజ‌ర్ బాగున్నాడు. మిగిలిన పాత్ర‌ల్లో ఉన్న‌ది ఒక్క‌టే సీన్ అయినా క‌డుపులు చెక్క‌లు చేసాడు వైవాహ‌ర్ష‌. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
సంగీతం అంత‌గా ఆక‌ట్టుకోలేదు. మ‌న సంగీత ద‌ర్శ‌కుడు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. అజినీష్ లోక్ నాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. పాట‌లు బాగోలేవు. రెండు గంట‌ల 29 నిమిషాల సినిమా అయినా పెద్ద‌గా ఎక్క‌డా బోర్ కొట్ట‌లేదంటే అది ఎడిట‌ర్ చోటా కే ప్ర‌సాద్ వ‌ల్లే సాధ్యం. సినిమాటోగ్ర‌ఫీ నీట్ గా అనిపించింది. నిర్మాత సుధీర్ బాబు ఖ‌ర్చు క‌నిపించింది. ఇక ఆర్ఎస్ నాయుడు రూపంలో తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రో ద‌ర్శ‌కుడు దొరికేసాడు. సింపుల్ క‌థ‌ను మ‌న‌సుకు హ‌త్తుకునేలా చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా:
న‌న్ను దోచుకుందువ‌టే.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా మ‌న‌సు దోచుకుంటుంది..

రివ్యూ: న‌న్ను దోచుకుందువ‌టే
న‌టీన‌టులు: సుధీర్ బాబు, న‌భాన‌టాష్, నాజ‌ర్ త‌దిత‌రులు
సంగీతం : బి ఎ లోకనాథ్
ఎడిటింగ్ : చోటా కే.ప్రసాద్
నిర్మాత: సుదీర్ బాబు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు : ఆర్ ఎస్ నాయుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here