వివాదాల హీరోతో న‌టిస్తానంటున్న న్యాచుర‌ల్ స్టార్..

నాని ఇంకో మల్టీస్టారర్ చేయబోతున్నాడా.. దేవదాసు ఫలితం చూసిన తర్వాత కూడా దైర్యం చేస్తున్నాడా.. ఓ తమిళ హీరోతో కలిసి త్వరలోనే మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నాడా.. ఏమో ఈ ప్ర‌శ్న‌ల‌కు అవును అనే స‌మాధాన‌మే ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఇప్పుడు. తమిళనాట వరస విజయాలతో పాటు వివాదాలు కూడా వెంటేసుకుని తిరుగుతున్న విశాల్ తో నాని ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. యాత్ర సినిమా దర్శకుడు మహి వి రాఘవ ఈ ఇద్దరు హీరోల కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ హీరోలకు లైన్ చెప్పి ఒప్పించాడు కూడా. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత నాని ఈ సినిమాపై ఓ నిర్ణయం తీసుకోనున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమాతో పాటు విక్రమ్ కె.కుమార్ సినిమాలకు కమిట్ అయ్యాడు న్యాచురల్ స్టార్.

Nani To do a Multi Starrer with Vishal
Nani To do a Multi Starrer with Vishal

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మహీ వి రాఘవ తెరకెక్కించబోయే మల్టీస్టారర్ పై దృష్టి పెట్టనున్నాడు నాచురల్ స్టార్. మరోవైపు విశాల్ కూడా తమిళనాట బిజీగా ఉన్నాడు. ఈయన నడిగర్ సంఘం వివాదాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తయిన తర్వాత నాని సినిమాపై ఫోకస్ చేయనున్నాడు ఈ యాక్షన్ హీరో. ఒకవేళ అన్నీ కుదిరి నాని, విశాల్ మల్టీస్టారర్ ఓకే అయితే తెలుగులో మరిన్ని మల్టీస్టారర్ ల‌కు బీజం పడ్డట్టే. ఇప్పటికే రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సెట్స్ పై వుంది. ఇలాంటి సమయంలో నాని కూడా మరో క్రేజీ మల్టీస్టారర్ చేస్తే మిగిలిన హీరోలు కూడా తమిళ హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here