బిగ్ బాస్ ఎవ‌రికి లాభం.. ఎవ‌రికి న‌ష్టం..?

బిగ్ బాస్ సీజ‌న్ 2 ముగిసింది. తొలి సీజ‌న్ లో తో పోలిస్తే రెండో సీజ‌న్ కు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. ఇది క‌చ్చితంగా నానికి కాస్త నిరాశే. ఎందుకంటే ఈయ‌న చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే ఏదేమైనా చివ‌రి వ‌ర‌కు బాగానే పోరాడాడు. నా వ‌ర‌కు నా జాబ్ చాలా బాగా చేసాన‌నే అనుకుంటున్నాన‌ని ట్వీట్ కూడా చేసాడు న్యాచుర‌ల్ స్టార్.

ఇదిలా ఉంటే ఇప్పుడు సీజ‌న్ ముగిసిపోయింది క‌దా.. అందుకే ఎవ‌రికి ఈ సీజ‌న్ తో లాభం.. ఎవ‌రికి న‌ష్టం అనే చిన్న కాంటెస్ట్ ర‌న్ చేస్తున్నారు. అందులో ఎలాగూ నాని ఉంటాడు. ఆయ‌న సీజ‌న్ ఉన్నా లేక‌పోయినా స్టార్ స్టారే కాబ‌ట్టి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేదు. ఇక ఈయ‌న త‌ర్వాత కౌశ‌ల్ కు బాగా హెల్ప్ అయ్యేలా ఉంది ఈ సీజ‌న్.

Nani Emotional Goodbye to Biggboss Telugu Season
Nani Emotional Goodbye to Biggboss Telugu Season

ఈయ‌న ఇప్ప‌టికే స్టార్ అయ్యాడు. కాస్త కానీ ప్లాన్ చేసుకుంటే క‌చ్చితంగా మ‌రో రేంజ్ కు వెళ్లిపోతాడు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది కూడా. ఈయ‌న టైట‌ల్ విన్ అయిన వెంట‌నే బ‌య‌ట ప్రేక్ష‌కుల‌ను చూస్తే మైండ్ గిర్రున తిర‌గ‌డం ఖాయం. అంత‌గా ఆయ‌న కోసం వ‌చ్చేసారు. ఇప్పుడిలా ఉంటుందా.. ఎప్పుడూ ఇలాగే ఉంటుందా అనేది మాత్రం ఆస‌క్తిక‌రమే.

ఎందుకంటే వాళ్లు ఊహించిన‌ట్లు ఎప్పుడూ ఇండ‌స్ట్రీ ఉండ‌దు క‌దా..? ఇదిలా ఉంటే తేజ‌స్వి.. భానుశ్రీ లాంటి వాళ్లు కూడా సెకండ్ సీజ‌న్ ముగిసేలోపు యాంక‌ర్లుగా సెటిల్ అయిపోయారు. నందిని రాయ్ కూడా సినిమాలు చేస్తుంది. మిగిలిన వాళ్ల‌కు ఎంత‌వ‌ర‌కు ఈ సీజ‌న్ హెల్ప్ అవుతుంది అనేది చూడాలిక‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here