118 టీజ‌ర్ టాక్.. క‌ళ్యాణ్ రామ్ లో ఎన్టీఆర్ క‌నిపించాడేంటి..?

ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు టీజ‌ర్ చూసిన త‌ర్వాత‌. అచ్చంగా ఎన్టీఆర్ ను దించేసాడు క‌ళ్యాణ్ రామ్. యాక్టింగ్ లో కాదు కానీ మేకోవ‌ర్ లో మాత్రం జూనియ‌ర్ క‌నిపించాడు. టెంప‌ర్.. అర‌వింద స‌మేత‌ల్లోని క్యాస్ట్యూమ్స్ ఇక్క‌డ కూడా క‌నిపించాయి. అందుకే అలా అనిపించి ఉంటాడు ప్రేక్ష‌కుల‌కు.

ఇప్పుడు ఈయ‌న 118 సినిమాతో వ‌స్తున్నాడు. పాపం కొన్నేళ్లుగా ఏ సినిమా చేసినా.. ఎలాంటి సినిమా చేసినా ఫ‌లితం మాత్రం ఫ్లాప్ అని వ‌స్తుంటే ఏ హీరోకైనా ఫ్ర‌ష్టేష‌న్ త‌ప్ప‌దు. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ కు కూడా ఇదే జ‌రుగుతుంది. 2015లో ప‌టాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ లేదు. షేర్, యిజం, నా నువ్వు, ఎమ్మెల్యే లాంటి సినిమాలు వ‌చ్చెళ్లాయి అంతే.

ఇక ఇప్పుడు మ‌హేష్ కోనేరు నిర్మాణంలోనే సినిమాటోగ్ర‌ఫ‌ర్ గుహ‌న్ ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ 118 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైందిప్పుడు. 49 సెకన్ల నిడివి ఉన్న టీజ‌ర్ లో స‌స్పెన్స్ థ్రిల్లర్ చూపించాడు గుహ‌న్. నివేదా పెద్దగా హైలైట్ కాలేదు కానీ కళ్యాణ్ రామ్ – షాలినిల జీవితంలో ఒకరోజు జ‌రిగిన అనుకోని సంఘటన ఏం చేసింది అనేది క‌థ‌.

కళ్యాణ్ రామ్ కు జరిగిన సంఘటనకు 1.18 సమయానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా టీజర్ లో చూపించారు. అందుకే సినిమా పేరు కూడా 118 అని పెట్టేసారు. నా నువ్వేతో పోలిస్తే స్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. మొత్తానికి కొన్నేళ్లుగా ఫ్లాపుల్లోనే ఉన్న క‌ళ్యాణ్ కు ఈ చిత్రం హిట్టిస్తుందో లేదో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here