మీటూ మంచికే.. కానీ అలా కాదంటున్న న‌మిత..

న‌మిత‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌ప్పుడు ఈమెకు గుడి క‌ట్టేంత అభిమానులున్నారు. పెళ్లి త‌ర్వాత ఈ మ‌ధ్య అస‌లు క‌నిపించ‌డం కూడా మానేసింది న‌మిత‌. ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు మ‌రోసారి అహంభావం అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.

namita says dont misuse me too movie

ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగా జ‌రుగుతుంది. అయితే క‌థా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో న‌టిస్తుంది. ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు భారీ అందాల‌ను కెమెరా ముందు ఉంచ‌డం లాంటివి చేయ‌డం లేదు న‌మిత‌. క‌చ్చితంగా సినిమాలు చేస్తానంటూనే గ్లామ‌ర్ పాత్ర‌లు మాత్రం చేయ‌నంటుంది. పెళ్లైంది క‌దా ఇప్పుడు అంతా ప‌ద్ద‌తిగా ఉండే రోల్స్ చేస్తాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.

ఇప్పుడు అహంభావంలో కూడా జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తుంది న‌మిత‌. ఇదిలా ఉంటే ఇప్పుడు మీటూ గురించి న‌మిత కూడా నోరు విప్పింది. మీటూ పేరుతో మహిళలు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. అది మంచికే.. అలా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం బ‌య‌టికి వ‌చ్చి ధైర్యంగా చెప్ప‌డం మంచి పరిణామ‌మే కానీ కొన్నిసార్లు అదే త‌ప్పుదోవ ప‌ట్టే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అందుకే ఎవ‌రెవ‌రు అయితే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ల గురించి మ‌రోసారి ఆలోచించాలి.. అందులో నిజ‌మెంతో శోధించాలి.. అప్పుడే అస‌లు నిజాలు బ‌య‌టికి వ‌స్తాయి.. మీటూ పేరు చెప్పుకుని క్రేజ్ తెచ్చుకోవ‌ద్ద‌ని చెబుతుంది న‌మిత‌. త‌న‌కు మాత్రం ఎప్పుడూ ఇలాంటి వేధింపులు రాలేద‌ని చెప్పింది ఈ భామ‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *