దేవ‌దాస్ సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:4

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (2 votes, average: 4.00 out of 5)
Loading...
movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

Devadas – Vanilla crime-comedy with icing of Nag-Nani bromance
Rating: 3/5

www.teluguodu.com

Bromantic Comedy
Rating: 3/5

www.123telugu.com

Nag & Nani ‘s Timepass Bromance
Rating: 2.75/5

www.telugu360.com

Time Pass!
Rating: 3/5

www.gulte.com

రివ్యూ         : దేవ‌దాస్
న‌టీన‌టులు   : నాని, నాగార్జున‌, ర‌ష్మిక‌, ఆకాంక్ష సింగ్ త‌దిత‌రులు
సంగీతం       : మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ : స‌్యామ్ ద‌త్ సైనాద్దీన్
నిర్మాత‌        : అశ్వినీద‌త్, వ‌యాక‌మ్ 18
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌

కృష్ణార్జున యుద్ధం ప్లాప్ తో షాక్ తిన్న నాని.. నాగార్జున లాంటి సీనియ‌ర్ హీరోతో క‌లిసి వ‌చ్చాడు. ఇక వ‌ర‌స ప్లాపుల‌తో ఉన్న నాగార్జున కూడా దేవ‌దాస్ తో హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. ఈ ఇద్ద‌రు స్టార్స్ ను త‌న క‌థ‌తో మెప్పించాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. మ‌రి ఈ ముగ్గురి కాంబినేష‌న్ ఎలా ఉంది..?

క‌థ‌:
దాస్(నాని) డాక్ట‌ర్. అమాయ‌కుడు.. మంచిత‌నం త‌ప్ప ఇంకేం తెలియ‌దు. ఓ కార్పోరేట్ హాస్పిట‌ల్లో డాక్ట‌ర్ గా జాయిన్ అవుతాడు. కానీ చిన్న త‌ప్పు చేసి బ‌య‌ట‌కి వ‌చ్చేస్తాడు. ఆ త‌ర్వాత క్లినిక్ వ‌చ్చి డాక్ట‌ర్ గా కంటిన్యూ అవుతాడు. అలాంటి టైమ్ లో పోలీసుల షూట్ అవుట్ లో గాయ‌ప‌డిన మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దేవ‌(నాగార్జున‌) దాస్ ద‌గ్గ‌రికి వ‌స్తాడు. అత‌డు దేవా అని త‌ర్వాత తెలిసినా కూడా కాపాడ‌తాడు ఆస్. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం చిగురిస్తుంది. మ‌రోవైపు దేవా కోసం పోలీసుల వేట మాత్రం సాగుతూనే ఉంటుంది. అదే టైమ్ లో దాస్ లైఫ్ లోకి పూజా(ర‌ష్మిక మంద‌న్న‌) వ‌స్తుంది. అప్ప‌ట్నుంచి దాస్ లైఫ్ కూడా మారిపోతుంది. అదే టైమ్ లో ఊహించ‌ని ట్విస్ట్ ఇస్తాడు దేవా. అప్పుడు దాస్ లైఫ్ ఎలా మారిపోయింది అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం:
అవి నేను కాలేజ్ చ‌దువుతున్న రోజులు.. ఇది నాగార్జున డైలాగ్.. అంటే ఎప్పుడు బ్లాక్ అండ్ వైటా అంటూ వెంట‌నే నాని పంచ్.. టీవీలో యాంక‌ర్ ను చూపించి ఆమెను ప్రేమిస్తున్నా అని నాగ్ చెబితే.. ఓ ఈమె నా చిన్న‌ప్ప‌ట్నుంచీ వార్త‌లు చ‌దువుతుంది అంటూ నాని మ‌రో పంచ్.. ఇలాంటి కామెడీ సీన్స్ కు దేవ‌దాస్ లో ఢోకా లేదు.

ఓ అమాయ‌క‌మైన డాక్ట‌ర్.. అత‌డి దగ్గ‌రికి ట్రీట్ మెంట్ కు వ‌చ్చే డాన్.. అత‌డు డాన్ అని డాక్ట‌ర్ కు తెలియ‌దు. డాక్ట‌ర్ ఎలాంటాడో డాన్ కు ఐడియా లేదు.ఒక్క‌సారి వాళ్లు ఇద్ద‌రు క‌నెక్ట్ అయిన త‌ర్వాత ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఇదే సింపుల్ గా చెప్పాలంటే దేవ‌దాస్ క‌థ‌. దీన్నే రెండున్నర గంట‌లు చెప్పాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది.. అక్కడ ఉన్నది నాని.. ఒక్క ఫ్లాప్ తో ఆయ‌న్ని త‌క్కువ అంచ‌నా వేయ‌డం క‌ష్టం.

అందుకే మ‌రోసారి మాయ చేసాడు. ఊహించని వేగంతో వచ్చాడు.. దేవదాస్ తో లెక్క సరి చేసాడు.. స్క్రీన్ పై మరోసారి మాయ చేసాడు న్యాచురల్ స్టార్. నాగార్జున ఉన్నా కూడా ఎందుకో నాని వైపు కళ్ళు వెళ్తాయి. ఆయ‌న కారెక్ట‌ర్ అలా ఉంది మ‌రి. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ కూడా ఈ పాత్ర‌పై అంత శ్ర‌ద్ధ తీసుకున్నాడు. నాని మళ్ళీ పూర్తిగా కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు.. ఇక కథ విషయానికి వస్తే.. మళ్ళీ రొటీన్ స్టోరీతోనే వచ్చాడు ద‌ర్శ‌కుడు. రాజ్ కుమార్ హిరాని స్టైల్ అని నాగ్ చెప్పారు కానీ ఆ స్థాయి కష్టమే.. అయితే తాను రాసుకున్న సింపుల్ స్టోరీని ఆసక్తికరంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు శ్రీరామ్ ఆదిత్య.

డాక్టర్ పాత్రలో నవ్వించి చంపేశాడు నాని.. ఆయన ఎక్స్ ప్రెషన్స్ పీక్స్. నాగార్జున ఈ ఏజ్ లో ఆ గ్లామర్ ఎంతో అర్థం కాదు.. నిజంగానే ఆయన ఏం తింటాడో..? ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా అనిపించింది. కానీ కామెడీతో కవర్ చేసాడు.. చాలాచోట్ల ఇదే కాపాడింది. హాస్పిట‌ల్ సీన్స్ కాస్త శంక‌ర్ దాదాను గుర్తు చేసాయి.

కాక‌పోతే ఇక్క‌డ డాన్ నాగార్జున‌.. డాక్ట‌ర్ నాని. శ్రీరామ్ ఆదిత్య మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు.. స్టార్ పవర్ ఉంది కాబట్టి దేవదాస్ బయట పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇంకాస్త కథ ఉంటే బాగుండేది అనిపించింది. నాని.. నాగార్జున కాంబినేషన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. వాటిపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు.. అదే సినిమాను కాపాడింది కూడా.. మరీ రొటీన్ కథ కావడం ఒక్కటే దేవదాస్ కి ప్రధాన మైనస్.. ఈ గండం దాటితే బిందాస్. ఓవరాల్ గా ఈ దేవదాస్.. నాని ఫుల్ పటాస్.

న‌టీన‌టులు:
నాగార్జున ఈ ఏజ్ లో కూడా ఎల ఆఉన్నాడంటే చెప్ప‌డానికి కూడా మాట‌లు స‌రిపోవ‌డం లేదు. అస‌లు ఆయ‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ చూసి ప‌డిపోవ‌డం ఖాయం. స్టైలిష్ డాన్ గా ర‌ప్పాడించాడు. నాని మ‌రోసారి ఎందుకు తాను న్యాచుర‌ల్ యాక్ట‌ర్ అనేది నిరూపించుకున్నాడు.

సింగిల్ హ్యాండ్ తో చాలా సీన్స్ నిల‌బెట్టాడు. అత‌డి కామెడీ టైమింగ్ సినిమాకు బ‌లం. ర‌ష్మిక మంద‌న్నా పెద్ద చెప్పుకోద‌గ్గ పాత్ర అయితే కాదు. పాట‌ల‌కు ప‌నికొచ్చింది. ఆకాంక్ష కూడా అంతే. మిగిలిన వాళ్ల‌లో న‌రేష్, రావు ర‌మేష్, ముర‌ళి శ‌ర్మ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు కూడా త‌మ త‌మ పాత్ర‌ల్లో మెప్పించారు.

టెక్నిక‌ల్ టీం:
మ‌ణిశ‌ర్మను ఓల్డ్ అయిపోయాడు అని మ‌నోళ్లు తీసి ప‌క్క‌న బెడుతున్నారు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తెలుసుకోలేక‌పోతున్నారు. ఈయ‌న మ‌రోసారి త‌న మ్యూజిక్ మ్యాజిక్ చూపించాడు. పాట‌లు బాగున్నాయి. స్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ప్ల‌స్.

ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ ప‌ర్లేదు. సెకండాఫ్ అక్క‌డ‌క్క‌డా ల్యాగ్ అయిన ఫీలింగ్ వ‌చ్చింది. ఇక ద‌ర్శ‌కుడిగా శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌కు ఉన్న క‌థ‌తో బాగానే మెప్పించాడు. అయితే మ‌రీ ఇంత రొటీన్ కాకుండా కాస్త కొత్త‌గా ట్రై చేసినా బాగుంటుంది.

చివ‌ర‌గా:
ఈ దేవ‌దాస్.. టైప్ పాస్ ఎంట‌ర్ టైన‌ర్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here