దేవ‌దాస్ ప్రీమియ‌ర్ షో టాక్.

భారీ అంచ‌నాల మ‌ధ్య దేవ‌దాస్ వ‌చ్చేసారు. నాగార్జున‌, నాని లాంటి స్టార్ హీరోలు క‌లిసి న‌టించిన సినిమా కావ‌డంతో ముందు నుంచి అంచ‌నాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు విడుద‌ల త‌ర్వాత కూడా ఇదే కంటిన్యూ అవుతుంది కూడా. ఇప్పుడు ఓవ‌ర్సీస్ నుంచి వ‌స్తున్న టాక్ ప్ర‌కారం చూస్తే సినిమా అబౌ యావ‌రేజ్ అంటున్నారు ప్రేక్ష‌కులు.

devadas

కామెడీకి ఢోకా లేక‌పోయినా సినిమాలో చాలా చోట్ల గాడి త‌ప్పే సీన్స్ ఉన్నాయంటున్నారు వాళ్లు. ముఖ్యంగా కేవ‌లం కామెడీపై ఫోక‌స్ చేసి క‌థ‌ను గాలికి వ‌దిలేసాడ‌నే విమ‌ర్శ‌లు శ్రీ‌రామ్ ఆదిత్య‌పై వ‌స్తున్నాయి. అయితే నాని కామెడీ ఈ సినిమాకి అతిపెద్ద ప్ల‌స్. ఆయ‌న సెకండాఫ్ మొత్తాన్ని అలా నిల‌బెట్టేసాడంటున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్.

ఫ‌స్టాఫ్ అంతా అక్క‌డ‌క్క‌డా న‌వ్వుల‌తో సాగిన ఈ చిత్రం.. సెకండాఫ్ మాత్రం మంచి కామెడీతో ముందుకెళ్లింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాపై ఉన్న క్రేజ్.. మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో దేవ‌దాస్ ఎలాగోలా బ‌య‌ట ప‌డిపోయే ఛాన్సులు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. నాని, నాగార్జున స్టార్ ప‌వ‌ర్ ఈ సినిమాకు శ్రీ‌రామ‌రక్ష‌. హీరోయిన్లు ర‌ష్మిక‌, ఆకాంక్ష‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌లే వ‌చ్చాయంటున్నారు ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్. కేవ‌లం వాళ్లు పాట‌ల‌కే ప‌రిమితం అయిపోయారు. ఓవ‌రాల్ గా యావ‌రేజ్ టాక్ తో వ‌స్తున్నారు దేవ‌దాస్. మ‌రి ఇండియాలో ఎలాంటి టాక్ తో ఈ సినిమా ఓపెన్ అవుతుందో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here