ప‌వ‌న్ ఫ్యామిలీపై నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

ఎంత అన్నాద‌మ్ములు అయినా కూడా ఎవ‌రి సొంత కుటుంబాలు వాళ్ల‌కు ఉంటాయి. ఒక్క‌సారి పెళ్లైన త‌ర్వాత వాళ్లు వేరే.. వీళ్లు వేరు. అలాగ‌ని వాళ్ల ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడే హ‌క్కు కానీ.. అధికారం కానీ మ‌రొక‌రికి ఉండ‌దు. అయితే ఇప్పుడు ఆ అధికారం తీసుకున్నాడు నాగ‌బాబు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్ళ‌పై వ‌స్తున్న ర‌మ‌ర్ల‌కు చెక్ పెడుతూ త‌మ్ముడు త‌రఫు నుంచి ఈయ‌న వకాల్తా తీసుకున్నాడు.

Nagababu Opens up on Pawan Kalyan wives
Nagababu Opens up on Pawan Kalyan wives

ప‌వ‌న్ ను రాజ‌కీయ ప‌రంగా విమ‌ర్శ చేసే అవ‌కాశం లేకే ఇలా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కెలుకుతున్నార‌ని.. మీకు అంత‌గా ఇష్టం అయితే కెలుక్కోండి అంటూ స‌మాధాన‌మిచ్చాడు బాబు. దాంతో పాటు ప‌వ‌న్ భార్య‌ల‌పై కూడా క‌మెంట్స్ చేసాడు నాగ‌బాబు. ముందు చేసుకున్న అమ్మాయి ఎందుకో త‌మ కుటుంబానికి స‌రిప‌డ‌లేద‌ని.. అందుకే కోర్ట్ ఇచ్చిన సౌకర్యంతోనే వాళ్ళిద్ద‌రూ విడిపోయార‌ని.. ఆ త‌ర్వాత రేణుదేశాయ్ క‌లిసింద‌ని.. ఆ అమ్మాయితో కూడా కొన్నేళ్లు ఉన్నాక ఏవో మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయార‌ని.. వాళ్లు కూడా ప‌ద్ద‌తి ప్ర‌కార‌మే విడిపోయార‌ని చెప్పాడు నాగ‌బాబు. ఇక ఇప్పుడు ఉన్న మూడో అమ్మాయి ఇండియ‌న్ కాద‌ని.. ర‌ష్య‌న్ అని.. ముందు ఇద్ద‌రు అమ్మాయిల‌తో పోలిస్తే ఇప్పుడు అన్నా త‌మ కుటుంబంతో క‌లిసిపోయింద‌ని.. అంతా ఆమెను చాలా ప్రేమిస్తార‌ని చెప్పాడు నాగ‌బాబు. ఇన్నాళ్ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరుకున్న‌.. అర్థం చేసుకునే అమ్మాయి దొరికింద‌ని త‌మ‌కు అనిపించింద‌ని చెప్పాడు నాగ‌బాబు.

ఈయ‌న వ్యాఖ్య‌లు రేణుదేశాయ్ ఫ్యాన్స్ ను హ‌ర్ట్ చేస్తున్నాయి. రేణును ప‌వ‌న్ దూరం చేసుకున్నాడు కానీ రేణు ఎప్పుడూ ప‌వ‌న్ దూరం కావాల‌ని కోరుకోలేద‌ని చెబుతున్నారు వాళ్లు. అయితే దీనిపై మాత్రం నాగ‌బాబు స్పందించ‌లేదు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ జీవితంలోకి వ‌చ్చిన అమ్మాయిల్లో అన్నా లెజెనీవా ప‌ర్ఫెక్ట్ అంటున్నాడు నాగ‌బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here