ఆరెంజ్ నాగ‌బాబును ముంచేసింద‌లా..

మ‌గ‌ధీర లాంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఆరెంజ్. ఈ ఒక్క సినిమాతోనే నాగ‌బాబు పూర్తిగా అప్పుల పాలైపోయాడు. రోడ్డుమీద‌కు వ‌చ్చేసాడు. అస‌లు ప్లానింగ్ లేకుండా సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. నిజానికి మంచి సినిమా చేసినా కూడా బ‌డ్జెట్ ఎక్కువ పెట్టి నాశ‌నం అయిపోయాడు. దానికి కార‌ణం ఆ చిత్ర ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ అని మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు నాగ‌బాబు. నిర్మాత‌గా త‌ను అంత ప‌ర్ఫెక్ట్ కాద‌ని.. అయితే ఆరెంజ్ టైమ్ లో కాస్త ప్లాన్ చేసుకుని ఉంటే బయ‌ట‌ప‌డేవాన్నేమో కానీ పూర్తిగా మునిగిపోవ‌డంతో ఓ ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య కూడా చేసుకోవాల‌ని ఆలోచించిన‌ట్లు చెప్పాడు నాగ‌బాబు.

అయితే ఆరెంజ్ సినిమా త‌న‌కు మంచి పాఠ‌మే నేర్పింద‌ని.. ఎవ‌ర్ని అంత ఈజీగా న‌మ్మ‌కూడ‌ద‌నే భావ‌న ఈ చిత్రంతోనే వ‌చ్చింద‌ని చెప్పాడు నాగ‌బాబు. అప్ప‌ట్నుంచే త‌న ఫ్యూచ‌ర్ పై దృష్టి పెట్టాన‌ని.. అప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని త‌న జీవితాన్ని అప్పుడే చ‌క్క‌బెట్టుకోడానికి ట్రై చేసాన‌ని చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్. మొత్తానికి ఆరెంజ్ సినిమా అనేది పూర్తిగా ద‌ర్శ‌కుడి ఫెయిల్యూరే అని బ‌ల్ల‌గుద్ది మ‌రి చెప్పాడు నాగ‌బాబు. మ‌గ‌ధీర లాంటి సినిమా త‌ర్వాత వ‌చ్చిన సినిమా కాబ‌ట్టి అంచ‌నాలు అలాగే ఉంటాయి.. కాస్త బ‌డ్జెట్ కూడా ప్లాన్ చేసుకుని ఉండాల్సింది.. అది భాస్క‌ర్ ను న‌మ్మి నేను చేసిన త‌ప్పు అని ఒప్పుకున్నాడు నాగ‌బాబు. ఇక ఇప్పుడు ఆయ‌న నిర్మాణానికి పూర్తిగా దూరం అయిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here