బాల‌కృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దు.. నాగ‌బాబు సంచ‌ల‌నం..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. ఈయ‌న ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీ స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసి మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించాడు. ఏకంగా నంద‌మూరి బాల‌కృష్ణ ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పాడు ఈ న‌టుడు. ఈ మ‌ధ్య కాలంలో జ‌న‌సేన‌, టిడిపి బానే మాట‌ల యుద్ధం చేసుకుంటున్నాయి.

Naga Babu Coments on Balakrishna

ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు త‌న త‌మ్ముడికి స‌పోర్ట్ గా నిలిచాడు. అందుకే బాల‌య్య గురించి అడిగితే త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పి వివాదానికి తెర‌తీసాడు. ఈ మ‌ధ్యే కేఏ పాల్ కూడా ఇలాగే త‌న‌కు బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పాడు. ఇప్పుడు నాగ‌బాబు కూడా ఇదే అన్నాడు. అయితే ఆయ‌న అన్న‌పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం సంచ‌ల‌నం అవుతుంది. లేక‌పోతే మ‌రేంటి.. నాగ‌బాబు లాంటి సీనియ‌ర్ ఆర్టిస్ట్ బాల‌య్య‌ను అలా అన‌డం ఏంటి అంటున్నారు.

ఎంత పార్టీల మ‌ధ్య గొడ‌వలుంటే మాత్రం ఇలా అనొచ్చా అంటున్నారు. బాల‌య్య గురించి చెప్పండి అంటే త‌న‌కు తెలియ‌దు అన‌డ‌మే కాకుండా.. ఓ బాల‌య్య గురించి తెలియ‌దు అన‌డం ఏంటి చిన్న‌పుడు చూసాను సినిమా.. కృష్ణ‌, బాల‌య్య క‌లిసి నేర‌ము శిక్షలో న‌టించార‌ని చెప్పాడు నాగ‌బాబు. ఆ బాల‌య్య కాదు.. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ అంటే సారీ.. అత‌నెవ‌రో త‌న‌కు తెలియ‌దు అని చెప్పాడు నాగ‌బాబు. ఇప్పుడు ఈ మాట‌లు బాల‌య్య ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పిస్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ ర‌చ్చ ఇంకెంత దూరం వెళ్తుందో..?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *