నాతో పెట్టుకుంటే అంతే.. ఎన్టీఆర్ కు నాదెండ్ల వార్నింగ్..

ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు ముందే వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియదు కానీ రిలీజ్ కు ముందే దీన్ని ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇది కేవలం ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలను తీసుకొని ఎలాంటి వివాదాలు లేకుండా తెరకెక్కించాడు క్రిష్. కానీ అసలు అనుమానాలు అన్నీ మహానాయకుడు పైనే ఉన్నాయి. ఈ చిత్రం పూర్తిగా ఎన్టీఆర్ రాజకీయాలపై ఆధారపడి తెరకెక్కింది. ఇందులో కొందరిని ప్రతినాయకులుగా చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం పై ప్రభావం చూపిస్తుంది.

NTR Biopic Warning to Nadenlla Bhasker
NTR Biopic Warning to Nadenlla Bhasker

అందుకే క్రిష్ మహానాయకుడు పై చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ కీలకంగా మారుతుందని తెలుస్తోంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల అంటూ వార్తలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ ను మహానాయకుడులో చిత్రీకరించార‌నే తెలుస్తుంది. దీనిపై ఇప్పుడు నాదెండ్ల సీరియస్ అవుతున్నాడు. సినిమాలో ప్రతినాయకుడిగా చూపిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 7న మహానాయకుడు విడుదల కానుంది. మరి ఇందులో నాదెండ్ల ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here