అఖిల్ చేజేతులా చేసుకున్నాడుగా.. ఇప్పుడేం చేయ‌లేం.

కళ్ళ ముందు ఉన్న అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకున్నాడు అఖిల్. ఏమైపోతుందో అని టెన్షన్ తో తన ముందున్న బంగారం లాంటి ఆఫర్ మిస్ చేసుకున్నాడు. అక్కినేని వారసుడు నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమా జనవరిలో విడుదల కానుంది. అయితే ముందు ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.

Mr Majnu Movie Date Locked

కానీ ఇప్పుడు పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు ఉన్నాయని తన సినిమాను జనవరికి వాయిదా వేసుకున్నాడు. కానీ ఇప్పుడు విడుదలైన పడి పడి లేచే మనసు, అంతరిక్షం రెండు ఫ్లాప్ అయ్యాయి. క్రిస్మస్ హాలిడేస్ ఎవరో కన్నడ హీరో య‌శ్ కు రాసిచ్చేశారు మన హీరోలు.

పండగ సెలవులు పూర్తిగా వదిలేసుకున్నారు తెలుగు హీరోలు. ఈ సమయంలో గానీ అఖిల్ వచ్చి ఉంటే కచ్చితంగా మిస్టర్ మజ్ను సినిమా వసూళ్ల వర్షం కురిపించే అవకాశాన్ని వదిలేసుకున్నాడు అక్కినేని వారసుడు. సినిమా ఎలా ఉందో అనేది పక్కన పెడితే యూత్ ఫుల్ ఎంట‌ర్టైనర్ కాబ‌ట్టి విజ‌యావ‌కాశాలు ఎక్కువగా ఉండేవని వాదన వినిపిస్తుంది.

ఇప్పుడు అనుకొని కూడా లాభం లేదు. ఎందుకంటే క్రిస్మస్ సెలవులను పూర్తిగా కే జి ఎఫ్ సినిమా దత్తత తీసుకుంది. ఒకవేళ ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఇప్పుడు బాధ పడుతున్నారు అక్కినేని అభిమానులు. జనవరిలో కంగ‌న ర‌నౌత్ మ‌ణిక‌ర్ణిక సినిమాకు పోటీగా త‌న సినిమాను తీసుకొస్తున్నాడు అఖిల్. మరి కనీసం మూడో సినిమాతోనైనా అఖిల్ విజయం అందుకుంటాడో లేదో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here