మోహ‌న్ బాబుకు మాతృవియోగం..

ప్రముఖ న‌టుడు.. నిర్మాత మంచు మోహ‌న్ బాబు అమ్మ‌గారు మంచు ల‌క్ష్మ‌మ్మ క‌న్నుమూసారు. ఆమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. సెప్టెంబ‌ర్ 20 ఉద‌యం 6 గంట‌ల‌కు ఆమె మ‌ర‌ణించారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ లోనే ఆమె క‌న్ను మూసార‌ని తెలుస్తుంది. ప్రస్తుతం మోహ‌న్ బాబు భార‌త‌దేశంలో లేరు.

Mohan-Babu-Mother-Lakshmamma-Last-Rites-Photos

ఆయ‌న కొన్ని రోజులుగా విదేశాల్లోనే ఉన్నారు. త‌ల్లి మ‌ర‌ణ‌వార్త తెలియ‌గానే హుటాహుటిన ఆయ‌న అక్క‌డ్నుంచి బ‌య‌లు దేరారు. సెప్టెంబర్ 21న మంచు ల‌క్ష్మ‌మ్మ అంత్యక్రియలు తిరుపతిలోనే జ‌ర‌గ‌నున్నాయి. నాయ‌న‌మ్మ మ‌ర‌ణంతో మంచు ల‌క్ష్మి విల‌పిస్తున్నారు. అమ్మ పేరునే త‌న కూతురుకు పెట్టుకున్నాడు మోహ‌న్ బాబు. ఇక మంచు మ‌నోజ్ కు కూడా నాయ‌న‌మ్మ‌తో చాలా మంచి అనుబంధం ఉంది.

ఆమె ఆశీస్సులు లేకుండా మ‌నోజ్ ఏ ప‌ని మొద‌లుపెట్ట‌డ‌నే వార్త‌లు ఉన్నాయి. ఇక మోహ‌న్ బాబుకు కూడా వ్య‌క్తిగ‌త జీవితంతో పాటు సినిమాల ప‌రంగానూ ప్ర‌తీ విష‌యంలోనూ అమ్మ స‌ల‌హాలు చాలా వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని అత‌డి స‌న్నిహితుడు చెబుతున్నారు. ఇప్పుడు అమ్మ మ‌ర‌ణ వార్త‌తో ఆయ‌న క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here