అంబ‌రీష్ కు మంచు మోహ‌న్ బాబు నివాళి..

స్నేహానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చే హీరోల్లో మోహ‌న్ బాబు కూడా ఒక‌రు. ఈయ‌న‌కు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా మోహ‌న్ బాబుతో ర‌జినీకాంత్.. అంబ‌రీష్.. శ‌త్రుఘ్న సిన్హా చాలా స్నేహంగా ఉంటారు. ఈ న‌లుగురు ప్రాణ స్నేహితులు. ఇప్పుడు ఈ నాలుగు గోడ‌ల్లోంచి ఓ గోడ శాశ్వ‌తంగా ఈ ప్ర‌పంచం నుంచి వెళ్లిపోయింది. క‌న్న‌డ లెజెండ‌రీ న‌టుడు అంబ‌రీష్ క‌న్నుమూయ‌డంతో మోహ‌న్ బాబు చ‌లించిపోయాడు. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట‌ను ప్రెస్ నోట్ రూపంలో బ‌య‌ట పెట్టారు క‌లెక్ష‌న్ కింగ్.

MohanBabu
35 ఏళ్ల స్నేహాన్ని ఇలా అర్ధాంత‌రంగా వ‌దిలేసి వెళ్లిపోతావ‌ని ఎప్పుడూ అనుకోలేదు.. నా ప్ర‌తీ విజ‌యంలో తోడుగా ఉన్న నువ్వు ఈ రోజు లేవు అంటే న‌మ్మ‌డానికి మ‌న‌సు క‌ష్టంగా అనిపిస్తుంది.. నువ్వు లేవ‌న్న నిజం తెలుసుకుని మ‌న‌సు న‌మ్మ‌నంటుంది.. మూడున్న‌ర ద‌శాబ్ధాల మ‌న ఈ స్నేహంలో నాకు ఎన్నో తీపి జ్ఞాప‌కాలు మిగిల్చి ఈ రోజు నువ్వు వెళ్లిపోయావు.. నీవు లేవ‌ని అంతా చెబుతున్నా నాకు మాత్రం ఎప్పుడూ నాలోనే ఉంటావ‌ని తెలుసు. స్నేహం అంటే ఎలా ఉంటుంది అని ఎవ‌రైనా అడిగితే అది మ‌న‌లాగే ఉంటుంద‌ని చూపిస్తాను.. అంత గొప్ప స్నేహాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ తోడుగా ఉన్న నువ్వు.. ఈ రోజు ఇలా న‌న్ను ఒంట‌రి చేసి వెళ్లిపోవ‌డం బాధ‌గానే ఉన్నా.. నువ్వు ఎక్క‌డున్నా నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ..

నీ ప్రాణ స్నేహితుడు

మోహ‌న్ బాబు మంచు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *